Kantara Chapter 1 Day 15 Collections: తగ్గిన కాంతార జోరు.. రిషబ్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?

రిషబ్ శెట్టి, రుక్మిణీ వసంత్ హీరో హీరోయిన్లుగా హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు నిర్మించిన చిత్రం కాంతార చాప్టర్ 1. గతంలో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. కాంతార చాప్టర్ 1లో జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో కాంతార చాప్టర్ 1 సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 15వ రోజు రిషబ్ శెట్టి మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది. దాంతో కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

Kantara Chapter 1 Day 15 Expected Box Office Collections Worldwide Rishab Shetty s Movie managed to stay

కాంతార ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
అలాగే కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. కాంతార చాప్టర్ 1ని ప్రపంచవ్యాప్తంగా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.

కాంతార చాప్టర్ 1 పదిహేను రోజుల కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కు పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఇండియా వైడ్‌గా తొలి రోజున 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 45.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 63 కోట్ల రూపాయలు, ఐదో రోజున 31.5 కోట్ల రూపాయలు, ఆరో రోజున 34.25 కోట్ల రూపాయలు, ఏడో రోజున 25 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 21.25 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 22.35 కోట్ల రూపాయలు, పదో రోజున 39 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 39.75 కోట్ల రూపాయలు, పన్నెండవ రోజున 13.5 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 14 కోట్ల రూపాయలు, పద్నాలుగో రోజున 10.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో 14 రోజుల వరకు కాంతార చాప్టర్ 1కు ఇండియా వైడ్‌గా 476.4 కోట్ల రూపాయల నెట్.. 569 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ వెల్లడించింది.

కాంతార చాప్టర్ 1 ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో కాంతార చాప్టర్ 1కు నార్త్ అమెరికాలో 38.20 కోట్ల రూపాయల మిగిలిన దేశాల నుంచి 63 కోట్ల రూపాయలు రావడంతో ఓవర్సీస్‌లో కాంతార చిత్రానికి 101 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి కాంతార చాప్టర్ 1కు వరల్డ్ వైడ్‌గా 670 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
తెలుగులో పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఈ సినిమాకు తొలి రోజున 13 కోట్ల రూపాయలు, రెండో రోజున 11.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 11.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 11.5 కోట్ల రూపాయలు, ఐదో రోజున 5.4 కోట్ల రూపాయలు, ఆరో రోజున 4.75 కోట్ల రూపాయలు, ఏడో రోజున 3.5 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 2.65 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 3.25 కోట్ల రూపాయలు, పదో రోజున 5 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 4.85 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 1.35 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 1.5 కోట్ల రూపాయ, పద్నాలుగో రోజున 1.1 కోట్ల రూపాయలు చొప్పున 80.8 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించినట్లు సాక్‌నిక్ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కాంతార వసూళ్లు పరిశీలిస్తే.. నైజాంలో 28.47 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 9.07 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 8.50 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3.65 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2.65 కోట్ల రూపాయలు, గుంటూరులో 3. 50 కోట్ల రూపాయలు, కృష్ణాలో 4 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.40 కోట్ల రూపాయల చొప్పున రాబట్టింది.

ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో కాంతార చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. కర్ణాటకలో ఈ సినిమా 149.95 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 80.8 కోట్ల రూపాయలు, హిందీలో 159 కోట్ల రూపాయలు, తమిళనాడులో 48.65 కోట్ల రూపాయలు, మలయాళంలో 37.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 101 కోట్ల రూపాయల చొప్పున రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది.

కాంతార 15వ రోజు కలెక్షన్స్
వీకెండ్‌లో దుమ్మురేపిన కాంతార .. వర్కింగ్ డేస్‌లో కాస్త దూకుడు తగ్గించింది. అయినప్పటికీ సోమ, మంగళ, బుధవారాల్లో రోజుకు 10 కోట్ల రూపాయలు తగ్గకుండా వసూళ్లు రాబట్టింది. 15వ రోజున గురువారం సాయంత్రం 6 గంటల వరకు కాంతార చాప్టర్ 1కు కన్నడలో 14 శాతం, తెలుగులో 13 శాతం, హిందీలో 9 శాతం, తమిళ్‌లో 17 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. 15వ రోజు కన్నడంలో 3 కోట్ల రూపాయలు, హిందీలో 3 కోట్ల రూపాయలు, తెలుగులో కోటి రూపాయలు, తమిళ్‌లో కోటి రూపాయలు, కేరళలో 25 లక్షలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 10 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాంతో త్వరలోనే కాంతార చాప్టర్ 1 మూవీ 700 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X