Kantara Overseas Box Office: ఓవర్సీస్‌లో కాంతార చాప్టర్ 1 ఊపు.. రిషబ్ శెట్టి మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
భారతీయ సినిమా చరిత్రలో సంచలన విజయం సాధించిన కాంతార చిత్రానికి పీక్వెల్‌గా వచ్చిన కాంతార చాప్టర్ 1 చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొన్న ఈ చిత్రం మొదటి రోజే రికార్డుస్థాయి కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమా నార్త్ అమెరికాలో కాస్త ఆలస్యంగా బాక్సాఫీస్ జోరును మొదలుపెట్టినా.. తొలి రోజు నుంచి వసూళ్ల ఊపును కొనసాగిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాల్లోకి వెళితే..
కాంతార చాప్టర్ 1 సినిమాకు భారీగా బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ 100 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరగడం విశేషంగా మారింది. ఇక తెలుగేతర రాష్ట్రాల బిజినెస్ విషయానికి వస్తే.. కర్ణాటక హక్కులు రికార్డు స్థాయిలో 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 850 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే కాంతార చాప్టర్ చిత్రం నార్త్ అమెరికా అంటే యూఎస్, కెనడాలో ప్రదర్శించిన ప్రీమియర్లకు ఓ మోస్తారు స్పందన లభించింది. ప్రీమియర్ల ద్వారా 500K వసూలు చేసింది. తొలి రోజు ముగిసే సమయానికి తెలుగు వెర్షన్ 449K డాలర్లు, కన్నడ వెర్షన్ 300K డాలర్లు, హిందీ వెర్షన్ 40K, మలయాళంలో 1K డాలర్ల వసూలు చేసింది. మొత్తంగా ప్రీమియర్ల ద్వారా 790K డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రీమియర్ల ద్వారా వచ్చిన పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పుంజుకోవడం కనిపించింది.
ఇక రెండో రోజు కూడా కాంతార చాప్టర్ 1 చిత్రం బాక్సాఫీస్ వద్ద సానుకూలమైన స్పందన కనిపించింది. హాలీడేస్ కావడంతో ఈ సినిమాకు భారీగా ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా రెండో రోజున కడపటి సమాచారం అందేసరికి..ఈ చిత్రం 850K డాలర్లు అంటే.. 7.54 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు ముగిసే సమయానికి మరింతగా వసూళ్లు నమోదు అవుతాయని ప్రత్యాంగీరా సినిమాస్ పేర్కొన్నది.
కాంతార చాప్టర్ 1 చిత్రం తొలి రోజు 89 కోట్ల రూపాయలు వసూలు చేసిందిన చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా కర్ణాటకలో 25 కోట్లు, తెలుగులో 16.5 కోట్లు, తమిళనాడులో 6.5 కోట్లు, కేరళలో 6 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియాలో 23 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఓవర్సీస్‌లో అంటే.. నార్త్ అమెరికాలో 7 కోట్లతో కలిపి ఇతర దేశాల్లో 13.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని నిర్మాతలు పేర్కొన్నారు.
ఇక కాంతార చాప్టర్ 1 చిత్రం ఓవర్సీస్‌లో థియేట్రికల్ రైట్స్‌ను 44.5 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 90 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ చిత్రం రానున్న రోజుల్లో ఏ మేరకు లాభాలను సాధిస్తుందో అనే విషయం వేచి చూడాల్సిందే అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











