Kantara Chapter 1 Day 2 Collections: కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల సంచలనం.. రెండ్రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లోకి
రిషబ్ శెట్టి, రుక్మిణీ వసంత్ హీరో హీరోయిన్లుగా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కాంతార చాప్టర్ 1. గతంలో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు భారీ బడ్జెట్‌తో సంయుక్తంగా కాంతార చాప్టర్ 1ను నిర్మించారు. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. కాంతార చాప్టర్ 1 మూవీకి అజనీష్ లోకనాథ్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంతార చాప్టర్ 1 సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు కాంతార చాప్టర్ 1 ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..
కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్
కాంతార చాప్టర్ 1పైనా తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొంది. దీనికి తగినట్లుగానే ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం కాంతార చాప్టర్ 1 తెలుగు థియేట్రికల్ రైట్స్ 100 కోట్లకు పైగా పలుకుతున్నాయట. నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లుగా చెబుతున్నారు. కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

కాంతార చాప్టర్ 1 బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారీ అంచనాల మధ్య కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.
కాంతార చాప్టర్ తొలి రోజు కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కు తొలి రోజున పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఇండియా వైడ్ 60 కోట్ల రూపాయల నెట్, 72 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. కర్ణాటకలో 18 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 12.5 కోట్ల రూపాయలు, హిందీలో 19.5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5.25 కోట్ల రూపాయలు, మలయాళంలో 4.75 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది.
ఇక ఓవర్సీస్‌లో కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలి రోజు నార్త్ అమెరికాలో ఈ సినిమాకు 260K (భారత కరెన్సీలో 2.30 కోట్ల రూపాయలు) వచ్చాయి. న్యూజిలాండ్, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలో కాంతార చాప్టర్ 1కు 2 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా కాంతారకు ఓవర్సీస్‌లో తొలి రోజు 5 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో ఓవర్సీస్ కలెక్షన్స్‌తో కలుపుకుని కాంతార చాప్టర్ 1కు వరల్డ్ వైడ్‌గా తొలిరోజు 80 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కాంతార తొలి రోజు కలెక్షన్స్
గతంలో వచ్చిన కాంతార సంచలన విజయం నేపథ్యంలో కాంతార చాప్టర్ 1కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభించింది. ఆంధ్రా, నైజాంలలో పెయిడ్ ప్రీమియర్స్‌కు కూడా బుకింగ్స్ బాగానే జరిగాయి. ప్రీమియర్స్‌తో కలిపి తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1కు తొలి రోజున 12.5 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చాయి. కడపటి వార్తలు అందేసరికి నైజాంలో 4.55 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 1.38 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 74 లక్షలు, కృష్ణాలో 91 లక్షల రూపాయల షేర్ చొప్పున కాంతాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మిగిలిన ఏరియాల డేటా అందాల్సి ఉంది.
కాంతార చాప్టర్ 1 రెండో రోజు కలెక్షన్స్
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో కాంతార చాప్టర్ 1కు రెండో రోజు మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రెండో రోజు ఉదయం నుంచే కర్ణాటకతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో సాలీడ్‌గా బుకింగ్స్ జరుగుతున్నాయట. అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కాంతార చాప్టర్ 1కు హిందీ వెర్షన్‌లో 8 శాతం, తెలుగు వెర్షన్‌లో 40 శాతం, కన్నడ వెర్షన్‌లో 61 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది.
ఇక రెండో రోజు కాంతార చాప్టర్ 1 వసూళ్లను పరిశీలిస్తే.. ఈ చిత్రం కర్ణాటకలో 10 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల రూపాయలు, తమిళనాడులో కోటి రూపాయలు, కేరళలో కోటి రూపాయలు హిందీలో 13 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి 50 లక్షల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా రెండో రోజు 35 కోట్ల రూపాయల గ్రాస్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో రెండ్రోజుల్లోనే కాంతార చాప్టర్ 1 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టి ఓవరాల్‌గా 115 కోట్ల వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











