Kantara Chapter 1 Day 4 Collections: కాంతారా చాప్టర్ 1 బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 300 కోట్లకు చేరువగా రిషబ్ మూవీ

రిషబ్ శెట్టి దర్శకత్వంలో కాంతారకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధిస్తోంది. కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. కాంతార చాప్టర్ 1 చిత్రం వీకెండ్‌ ముగిసేలోగా 300 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంతార చాప్టర్ 1 సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగో రోజు కాంతార చాప్టర్ 1 ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు కాంతార చాప్టర్ 1ను నిర్మించారు. రిషబ్ శెట్టి సరసన రుక్మిణీ వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు.

Kantara Chapter 1 Day 4 Expected Box Office Collections Worldwide Rishab Shetty s Movie heading towards 300 crores mark

కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లుగా చెబుతున్నారు. కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

కాంతార చాప్టర్ 1 బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారీ అంచనాల మధ్య కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.

కాంతార చాప్టర్ 1 మూడు రోజుల కలెక్షన్స్
రిషబ్ శెట్టి మూవీకి పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఇండియా వైడ్ తొలి రోజున 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 46 కోట్ల రూపాయలు, మూడో రోజున 55.25 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఇండియాలో 163 కోట్ల రూపాయల నెట్.. 195.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇక ఓవర్సీస్‌లో కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్ పరిశీలిస్తే.. ఒక్క నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 1.9 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 16.86 కోట్ల రూపాయలు) రాబట్టింది. యూకే, యూరప్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలలో 6 కోట్ల రూపాయల చొప్పున ఓవర్సీస్‌లో 23 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి కాంతార చాప్టర్ 1 వరల్డ్ వైడ్‌గా మూడు రోజుల్లో 218 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

తెలుగు రాష్ట్రాల్లో కాంతార తొలి రోజు కలెక్షన్స్
తొలి రోజున ఈ చిత్రానికి పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల రూపాయలు, రెండో రోజున 12 కోట్ల రూపాయలు, మూడో రోజున 11.75 కోట్ల రూపాయలు చొప్పున కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలోని ప్రాంతాల వారీగా కాంతార కలెక్షన్స్ పరిశీలిస్తే.. కర్ణాటకలో 47.6 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 36.5 కోట్ల రూపాయలు, హిందీలో 50 కోట్ల రూపాయలు, తమిళనాడులో 15.75 కోట్ల రూపాయలు, మలయాళంలో 13.25 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 22.5 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది.

కాంతార చాప్టర్ 1 నాలుగో రోజు కలెక్షన్స్
ఆదివారం కావడంతో కాంతార చాప్టర్ 1కు భారీగా టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. నాలుగో రోజు సాయంత్రం 4 గంటల వరకు ఈ సినిమాకు కన్నడ వెర్షన్‌లో 85 శాతం, తెలుగు వెర్షన్‌లో 45 శాతం, హిందీ వెర్షన్‌లో 25 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. ఫస్ట్ షో, సెకండ్ షోల నాటికి బుకింగ్స్ మరింత పుంజుకుంటాయని భావిస్తున్నారు. నాలుగో రోజు కాంతార చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. కన్నడంలో 20 కోట్ల రూపాయలు, హిందీలో 17 కోట్ల రూపాయలు, తెలుగులో 12 కోట్ల రూపాయలు, తమిళంలో కోటి రూపాయలు, మలయాళంలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయల చొప్పున 55 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో రిషబ్ శెట్టి మూవీ 4 రోజుల వరకు 280 కోట్లు రాబడుతుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X