Kantara Chapter 1 Day 5 Collections: ఓజీ రికార్డు అవుట్.. కాంతార 400 కోట్లకు చేరువగా.. 5వ రోజు ఎన్ని కోట్లంటే?
దక్షిణాదిలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న చిత్రం కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జయరాం, గుల్షన్ దేవయ్య, రాకేష్ పూజారీ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి ఛాలువే గౌడ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫిని, కేఎం ప్రకాశ్, శోభిత్ శెట్టి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ బీ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే కంతార చిత్రం సంచలన విజయం సాధించడంతో ఈ చిత్రంపై బిజినెస్ పరంగాను, కంటెంట్ పరంగాను అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ వివరాల్లోకి వెళితే..
కాంతర చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బారీ వసూళ్లు రాబట్టడంతో కాంతార చాప్టర్ 1 సినిమాకు భారీగా బిజినెస్ జరిగింది. ఈ చిత్రం నైజాం థియేట్రికల్ హక్కులు 40 కోట్ల రూపాయలు, ఆంధ్రా రైట్స్ 45 కోట్ల రూపాయలు, సీడెడ్ 15 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ 100 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 170 కోట్ల రూపాయల మేర వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంది.

ఇక తెలుగేతర రాష్ట్రాల బిజినెస్ విషయానికి వస్తే.. కర్ణాటక హక్కులు రికార్డు స్థాయిలో 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 850 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
కాంతార చాప్టర్ 1 చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లు సాక్ నిక్ వెల్లడించిన ప్రకారం.. తొలిరోజు 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజు 45.4 కోట్ల రూపాయలు, మూడో రోజు 55 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 61.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 223 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని వెల్లడించింది.
ఇక ఇండియాలో వివిధ భాషల్లో కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాల్లోకి వెళితే.. కన్నడలో 63 కోట్ల రూపాయలు, తెలుగులో 47 కోట్ల, హిందీలో 74 కోట్ల రూపాయలు, తమిళంలో 21.75 కోట్ల రూపాయలు, మలయాళంలో 17.9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం కేవలం 4 రోజుల్లోనే 200 కోట్ల మైలురాయిని దాటింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఓవర్సీస్ మార్కెట్ విషయానికి వస్తే.. ఈ చిత్రం యూఎస్, కెనడా బాక్సాఫీస్ వద్ద పుంజుకొంటున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 2.4 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 21 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఈ చిత్రం యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, ఇతర దేశాల్లో కలిపి మొత్తంగా 50 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. దాంతో నాలుగు రోజుల్లో 273 కోట్ల నెట్.. 335 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక 5వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలిచింది. ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి సుమారుగా 40 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. ఈవెనింగ్ షోస్, రాత్రి షోస్‌కు ఆక్యుపెన్సీ పెరిగితే.. ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం త్వరలోనే 400 కోట్లకు చేరువ కానున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











