Kantara Chapter 1 Day 6 Collections: కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ కలెక్షన్స్ .. 6 రోజుల్లో ఎంత రాబట్టిందంటే?

విజయదశమి కానుకగా అక్టోబర్ 2వ తేదీన విడుదలైన కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. అంచనాలను నిజం చేస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కాంతారకు ప్రీక్వెల్‌గా హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు కాంతార చాప్టర్ 1ని నిర్మించారు. రిషబ్ శెట్టి దర్శకుడిగా, హీరోగా రెండ రకాల పాత్రలు పోషించారు. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఈ నేపథ్యంలో కాంతార చాప్టర్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 6 రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే..

కాంతార చాప్టర్ 1లో జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ సంగీత సారథ్యం వహించగా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటర్‌గా సేవలందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాకు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా శాండల్‌వుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Kantara Chapter 1 Day 6 Expected Box Office Collections Worldwide Rishab Shetty movie get good number

కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లుగా చెబుతున్నారు. కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది. కాంతార చాప్టర్ 1 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారీ అంచనాల మధ్య కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.

కాంతార చాప్టర్ 1 ఐదు రోజుల కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1 ఐదు రోజుల వరకు రాబట్టిన వసూళ్లను పరిశీలిస్తే.. ఇండియా వైడ్‌గా తొలి రోజున 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 46 కోట్ల రూపాయలు, మూడో రోజున 55.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 63 కోట్ల రూపాయలు, ఐదో రోజున 31.25 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఐదు రోజుల వరకు కాంతార చాప్టర్ 1కు ఇండియాలో 256.5 కోట్ల రూపాయల నెట్.. 307 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

కాంతార చాప్టర్ 1 ఓవర్సీస్ వసూళ్లు పరిశీలిస్తే.. 5 రోజుల వరకు రిషబ్ శెట్టి మూవీ నార్త్ అమెరికాలో ప్రభంజనం సృష్టిస్తోంది. 2.6 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో 23.7 కోట్ల రూపాయలు) వసూళ్లు సాధించినట్లు కాంతార నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగిరా ఫిలింస్ ప్రకటించింది. మిగిలిన గల్ఫ్, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, యూకేలలోనూ ఈ చిత్రానికి చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తున్నాయి. ఈ ఏరియాలలో 5 రోజుల వరకు 33 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది కాంతార చాప్టర్ 1. దాంతో మొత్తంగా ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో రిషబ్ శెట్టి మూవీకి 56 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి 5 రోజుల వరకు కాంతార చాప్టర్ 1కు వరల్డ్ వైడ్‌గా 362.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లోకాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి కాంతార చాప్టర్ 1కు తొలి రోజున 13 కోట్ల రూపాయలు, రెండో రోజున 11.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 11.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 11.5 కోట్ల రూపాయలు, ఐదో రోజున 5.5 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. కన్నడంలో 75.85 కోట్ల రూపాయలు, తెలుగులో 52.75 కోట్ల రూపాయలు, హిందీలో 82.25 కోట్ల రూపాయలు, తమిళంలో 24.75 కోట్ల రూపాయలు, మలయాళంలో 20.9 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది.

కాంతార చాప్టర్ 1 ఆరో రోజు కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1 ఆరో రోజు వసూళ్లు పరిశీలిస్తే.. వీక్ డేస్‌లోనూ ఈ సినిమా భారీగా కలెక్షన్స్‌ను రాబడుతోంది. ఓ పక్క ఓజీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ ఈ సినిమా సాలీడ్‌‌గా కలెక్షన్స్ సాధిస్తోంది. 6వ రోజు సాయంత్రం 5 గంటల వరకు కన్నడంలో 57 శాతం, తెలుగులో 19 శాతం, హిందీలో 14 శాతం వరకు థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. 6వ రోజు కాంతార చాప్టర్ 1కి కన్నడంలో 5 కోట్ల రూపాయలు, తెలుగులో 2 కోట్ల రూపాయలు, తమిళంలో కోటి రూపాయలు, కేరళలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున 14 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా 6 రోజుల వరకు కాంతార చాప్టర్ 1 మూవీ 390 కోట్ల రూపాయలు రాబడుతుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X