Kantara Chapter 1 Day 7 Collections: 500 కోట్లకు చేరువగా కాంతార చాప్టర్ 1.. రిషబ్ శెట్టి సంచలన రికార్డు
దక్షిణాదిలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న చిత్రం కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జయరాం, గుల్షన్ దేవయ్య, రాకేష్ పూజారీ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి ఛాలువే గౌడ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫిని, కేఎం ప్రకాశ్, శోభిత్ శెట్టి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ బీ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే కంతార చిత్రం సంచలన విజయం సాధించడంతో ఈ చిత్రంపై బిజినెస్ పరంగాను, కంటెంట్ పరంగాను అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ వివరాల్లోకి వెళితే..
కాంతర చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బారీ వసూళ్లు రాబట్టడంతో కాంతార చాప్టర్ 1 సినిమాకు భారీగా బిజినెస్ జరిగింది. ఈ చిత్రం నైజాం థియేట్రికల్ హక్కులు 40 కోట్ల రూపాయలు, ఆంధ్రా రైట్స్ 45 కోట్ల రూపాయలు, సీడెడ్ 15 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ 100 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 170 కోట్ల రూపాయల మేర వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంది.

ఇక తెలుగేతర రాష్ట్రాల బిజినెస్ విషయానికి వస్తే.. కర్ణాటక హక్కులు రికార్డు స్థాయిలో 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 850 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
కాంతార చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో కాంతార చాప్టర్ 1 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన ప్రతీ చోట ప్రభంజనం మాదిరిగా కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ తొలిరోజు 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజు 45.4 కోట్ల రూపాయలు, మూడో రోజు 55 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 63 కోట్లు, 5వ రోజు 31.5 కోట్లు, 6వ రోజు 34 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 6 రోజుల్లో ఇండియాలో 290 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను వసూలు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది.
కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం గత 6 రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. కర్ణాటకలో 93 కోట్ల రూపాయలు, తెలుగులో 66 కోట్ల రూపాయలు, హిందీలో 94 కోట్ల రూపాయలు, తమిళంలో 27 కోట్ల రూపాయలు, మలయాళంలో 23 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా గత 6 రోజుల్లో ఓవర్సీస్‌లో 75 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 365 కోట్ల నెట్, 427.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ నటించిన ఈ సినిమా 7వ రోజు కూడా స్ట్రాంగ్‌గా వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఈ చిత్రం ఇండియాలో 30 కోట్ల రూపాయలు ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు రాబట్టడం ఖాయంగా చెప్పుకొంటున్నారు. దాంతో ఈ సినిమా 35 కోట్ల మేర కలెక్షన్లను సాధించవచ్చు. అంతేకాకుండా ఈ చిత్రం ఇండియాలోనే 300 కోట్ల రూపాయలు మైలురాయిని దాటడం స్పష్టమైంది. ఈ చిత్రం 460 కోట్ల రూపాయల వసూలు చేసింది.
ఈ చిత్రం కన్నడలో కాంతార లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించింది. ప్రస్తుతం రెండో అతిపెద్ద వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేజీఎఫ్ 2 చిత్రం ప్రస్తుతం టాప్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డును కొనసాగిస్తున్నది.


Click it and Unblock the Notifications











