Kantara Chapter 1 Day 8 Collections: కాంతార వసూళ్లపై ఊహించని దెబ్బ.. 8వ రోజు రిషబ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

దేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు నిర్మించిన చిత్రం కాంతార చాప్టర్ 1. మూడేళ్ల క్రితం సంచలన విజయం సాధించిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ సినిమాను నిర్మించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 విజయదశమి కానుకగా విడుదలైంది. రికార్డ్ కలెక్షన్స్‌తో 500 కోట్ల మార్క్ దిశగా పరుగులు తీస్తోంది కాంతార చాప్టర్ 1. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 8వ రోజు కాంతార చాప్టర్ 1 ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత?
కాంతార చాప్టర్ 1లో రిషబ్ శెట్టి సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించారు. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది.

Kantara Chapter 1 Day 8 Expected Box Office Collections Worldwide Rishab Shetty s Movie saw a significant drop

కాంతార చాప్టర్ 1 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది. దాంతో కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది. ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. కాంతార చాప్టర్ 1ని ప్రపంచవ్యాప్తంగా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.

కాంతార చాప్టర్ 1 వారం రోజుల కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కు పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఇండియా వైడ్‌గా తొలి రోజున 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 45.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 63 కోట్ల రూపాయలు, ఐదో రోజున 31.5 కోట్ల రూపాయలు, ఆరో రోజున 34.25 కోట్ల రూపాయలు, ఏడో రోజున 25 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి. దాంతో తొలి వారం ఇండియాలో 316 కోట్ల రూపాయల నెట్.. 378.25 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

కాంతార చాప్టర్ 1 ఓవర్సీస్ కలెక్షన్స్
రిలీజ్ ముందు నుంచే నార్త్ అమెరికాలో కాంతార హవా కనిపించింది. 7 రోజుల వరకు అక్కడ కాంతార చాప్టర్ 1కు 3 మిలియన్ డాలర్లకు పైగా (భారత కరెన్సీలో 27 కోట్ల రూపాయలు) రాబట్టింది.
నార్త్ అమెరికాను మినహాయించి మిగిలన ఓవర్సీస్ మార్కెట్‌లో 40 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసింది ఈ చిత్రం. దీంతో ఓవరాల్‌గా తొలి వారం ఓవర్సీస్‌లో కాంతార చాప్టర్ 1కు 67 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. దాంతో ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి కాంతార చాప్టర్ 1 ఇప్పటి వరకు 444.7 కోట్ల రూపాయలు ఆర్జించింది.

తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
తెలుగులో పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఈ సినిమాకు తొలి రోజున 13 కోట్ల రూపాయలు, రెండో రోజున 11.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 11.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 11.5 కోట్ల రూపాయలు, ఐదో రోజున 5.4 కోట్ల రూపాయలు, ఆరో రోజున 4.75 కోట్ల రూపాయలు, ఏడో రోజున 3.5 కోట్ల రూపాయలు చొప్పున 60.9 కోట్ల రూపాయలు అందుకుంది కాంతార చాప్టర్ 1. తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కాంతార వసూళ్లు పరిశీలిస్తే.. నైజాంలో 20.50 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 7.50 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 6.75 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2 కోట్ల రూపాయలు, గుంటూరులో 2.75 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3.30 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.60 కోట్ల రూపాయల చొప్పున రాబట్టింది.

ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో కాంతార చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. కర్ణాటకలో 98.85 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 60.9 కోట్ల రూపాయలు, హిందీలో 102 కోట్ల రూపాయలు, తమిళనాడులో 29.4 కోట్ల రూపాయలు, మలయాళంలో 24.85 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది.

కాంతార 8వ రోజు కలెక్షన్స్
8వ రోజైన గురువారం కాంతార చాప్టర్ 1 బుకింగ్స్ స్వల్పంగా తగ్గాయి. 8వ రోజు సాయంత్రం 3 గంటల వరకు కన్నడంలో 20 శాతం, తెలుగులో 13 శాతం, హిందీలో 8 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ డేటా చెబుతోంది. ఈ లెక్కన 8వ రోజు కాంతార చాప్టర్‌ 1కు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, కన్నడంలో 7 కోట్ల రూపాయలు, హిందీలో 8 కోట్ల రూపాయలు, తమిళం, మళయాళం+ రెస్టాఫ్ ఇండియా కలిపి 1.50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 1.50 కోట్లు చొప్పున వరల్డ్ వైడ్‌గా 20 కోట్ల రూపాయల గ్రాస్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో 8 రోజుల వరకు కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా 470 కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంటుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X