Kantara Chapter 1 Day 9 Collections: 500 కోట్ల క్లబ్‌లోకి కాంతార... ఎన్టీఆర్ రికార్డ్ బ్రేక్, రిషబ్ సంచలనం
కాంతారకు ప్రీక్వెల్‌గా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతార చాప్టర్ 1. ఈ సినిమాలో రిషబ్‌కు జోడీగా రుక్మిణీ వసంత్ నటించారు. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు కాంతార చాప్టర్ 1ను నిర్మించారు. విజయదశమి కానుకగా విడుదలైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 9వ రోజు కాంతార చాప్టర్ 1 ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది. దాంతో కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది.
కాంతార ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
అలాగే కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. కాంతార చాప్టర్ 1ని ప్రపంచవ్యాప్తంగా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.
కాంతార చాప్టర్ 1 ఎనిమిది రోజుల కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కు పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఇండియా వైడ్‌గా తొలి రోజున 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 45.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 63 కోట్ల రూపాయలు, ఐదో రోజున 31.5 కోట్ల రూపాయలు, ఆరో రోజున 34.25 కోట్ల రూపాయలు, ఏడో రోజున 25 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 21.25 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఈ సినిమాకు 8 రోజుల వరకు కాంతార చాప్టర్ 1కు 337.4 కోట్ల రూపాయల నెట్.. 403.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చింది.
కాంతార చాప్టర్ 1 ఓవర్సీస్ కలెక్షన్స్
ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. 8 రోజుల వరకు కాంతార ఒక్క నార్త్ అమెరికాలో 3.2 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 28.37 కోట్ల రూపాయలు) కలెక్షన్స్ రాబట్టింది. మిగిలిన యూరప్, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో 44 కోట్ల రూపాయలు వసూలు చేసింది కాంతార చాప్టర్ 1. దాంతో రిషబ్ శెట్టి చిత్రం 8 రోజుల వరకు ఓవర్సీస్‌లో 72 కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా 476 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ డేటా చెబుతోంది. అయితే ఫస్ట్ వీకెండ్‌లోనే కాంతార 509.25 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్ధ హోంబలే ఫిలింస్ అధికారికంగా ప్రకటించింది. దీంతో కేజీఎఫ్ 2 తర్వాత 500 కోట్ల మార్క్ అందుకున్న రెండో కన్నడ సినిమాగా రిషబ్ శెట్టి మూవీ నిలిచింది. అలాగే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా ఉన్న వార్ 2 (475 కోట్లు) కలెక్షన్స్‌ని అధిగమించింది.
తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
తెలుగులో పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఈ సినిమాకు తొలి రోజున 13 కోట్ల రూపాయలు, రెండో రోజున 11.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 11.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 11.5 కోట్ల రూపాయలు, ఐదో రోజున 5.4 కోట్ల రూపాయలు, ఆరో రోజున 4.75 కోట్ల రూపాయలు, ఏడో రోజున 3.5 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 2.65 కోట్ల రూపాయలు చొప్పున 63.55 కోట్ల రూపాయలు అందుకుంది కాంతార చాప్టర్ 1. తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కాంతార వసూళ్లు పరిశీలిస్తే.. నైజాంలో 22.89 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 7.79 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 7.10 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3.05 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2.04 కోట్ల రూపాయలు, గుంటూరులో 2.79 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3.36 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.70 కోట్ల రూపాయల చొప్పున రాబట్టింది.
ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో కాంతార చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. కర్ణాటకలో 106.95 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 63.55 కోట్ల రూపాయలు, హిందీలో 108.75 కోట్ల రూపాయలు, తమిళనాడులో 31.5 కోట్ల రూపాయలు, మలయాళంలో 26.65 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది.
కాంతార 9వ రోజు కలెక్షన్స్
9వ రోజైన శుక్రవారం ఉదయం నుంచే చాలా ఏరియాలలో ఈ సినిమా సాలీడ్ బుకింగ్స్ అందుకుంది. వీకెండ్ మొదలు కానుండటంతో శుక్రవారం సాయంత్రం నుంచి కాంతార మరోసారి జూలు విదిల్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. 9వ రోజు సాయంత్రం 4 గంటల వరకు కన్నడంలో 15 శాతం, తెలుగులో 16 శాతం, హిందీలో 8 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ డేటా చెబుతోంది. దాంతో 9వ రోజు కాంతార చాప్టర్ 1కు తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయలు, కన్నడంలో 9 కోట్ల రూపాయలు, హిందీలో 9 కోట్ల రూపాయలు, తమిళం, మళయాళం+ రెస్టాఫ్ ఇండియా కలిపి 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 28 కోట్ల రూపాయల గ్రాస్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో 9 రోజుల వరకు కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా 540 కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











