Kantara Chapter 1 Hindi Collection: హిందీలో కాంతార హవా.. రిషబ్ మూవీ ఫస్ట్ వీక్ ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
రిషబ్ శెట్టి హీరోగా హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు నిర్మించిన చిత్రం కాంతార చాప్టర్ 1. గతంలో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్మిణీ శెట్టి హీరోయిన్‌గా నటించారు. ప్రకృతి, రాజరికం, దైవిక శక్తులు, గిరిజనుల అస్తిత్వ పోరాటం ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమా కన్నడిగులతో పాటు అన్ని ప్రాంతాల వారిని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు.. ఈ సినిమాకు ఫిదా అవుతున్నారు. కర్ణాటకను మించేలా ఇక్కడ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? హిందీలో ఫస్ట్ వీక్ కాంతారకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయో పరిశీలిస్తే..
కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత?
కాంతార చాప్టర్ 1లో జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది.

కాంతార చాప్టర్ 1 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లుగా చెబుతున్నారు. కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది. ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారీ అంచనాల మధ్య కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.
కాంతార చాప్టర్ 1 వారం రోజుల కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కు పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఇండియా వైడ్‌గా తొలి రోజున 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 45.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 63 కోట్ల రూపాయలు, ఐదో రోజున 31.5 కోట్ల రూపాయలు, ఆరో రోజున 34.25 కోట్ల రూపాయలు, ఏడో రోజున 25 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి. దాంతో తొలి వారం ఇండియాలో 316 కోట్ల రూపాయల నెట్.. 378.25 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.
కాంతార చాప్టర్ 1 ఓవర్సీస్ కలెక్షన్స్
ఇక ఓవర్సీస్‌లో కనివినీ ఎరుగని స్థాయిలో కాంతార చాప్టర్ 1కు కలెక్షన్స్ వస్తున్నాయి. నార్త్ అమెరికాలో తొలి రోజు నుంచి భారీ వసూళ్లు సాధిస్తోన్న ఈ చిత్రం ఫస్ట్ వీక్ 3 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 26.62 కోట్ల రూపాయలు) రాబట్టింది. యూకే, యూరప్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తదితర దేశాలలో మరో 30 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో ఓవరాల్‌గా 7 రోజుల వరకు ఓవర్సీస్‌లో కాంతార చాప్టర్ 1కు 66.5 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.
ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో కాంతార చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. కర్ణాటకలో 98.85 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 60.9 కోట్ల రూపాయలు, తమిళనాడులో 29.4 కోట్ల రూపాయలు, మలయాళంలో 24.85 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఫస్ట్ వీక్‌లో వరల్డ్ వైడ్‌గా రిషబ్ శెట్టి మూవీ 450 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. తద్వారా 2025లో 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నాలుగో భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటికే ఛావా, సైయారా, కూలీ చిత్రాలు ఈ ఫీట్ సాధించగా.. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 కూడా ఈ లిస్ట్‌లో ప్లేస్ కొట్టేసింది.
హిందీలో కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
రిలీజ్ రోజు నుంచి కాంతార చాప్టర్ 1 హిందీ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తోంది. ఈ సినిమా దెబ్బకు సన్నీ సంస్కారి కీ తులసి కుమారి తదితర చిత్రాలు అడ్రస్ లేకుండా పోయాయి. హిందీలో కాంతార చాప్టర్ 1 తొలి రోజున 18.5 కోట్ల రూపాయలు, రెండో రోజున 12.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 19.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 23 కోట్ల రూపాయలు, ఐదో రోజున 8.75 కోట్ల రూపాయలు, ఆరో రోజున 11.25 కోట్ల రూపాయలు, ఏడో రోజున 8.5 కోట్ల రూపాయలు చొప్పున ఫస్ట్ వీక్‌లో 102 కోట్ల రూపాయలు రాబట్టింది. కాంతార సొంత రాష్ట్రం కర్ణాటకలో 98.85 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టగా.. హిందీలో అంతకుమించి వసూలు చేయడం గమనార్హం. కాంతార చాప్టర్ 1 ఇప్పటి వరకు రాబట్టిన మొత్తం వసూళ్లలో ఒక్క హిందీ నుంచే దాదాపు 35 శాతం వాటా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి రానున్న రోజుల్లో రిషబ్ శెట్టి మూవీ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











