Kantara Chapter 1 Hindi Collection: హిందీలో కాంతార చాప్టర్ 1 మేనియా.. రెండ్రోజుల్లో ఎంత రాబట్టిందంటే?

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కాంతార చాప్టర్ 1. మూడేళ్ల క్రితం సంచలన విజయం సాధించిన కాంతారకు ప్రీక్వెల్‌గా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా.. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాంతార చాప్టర్ 1కు అజనీష్ లోకనాథ్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటర్‌గా పనిచేశారు.

గతంలో కాంతార సంచలన విజయం సాధించడానికి హిందీ బెల్ట్‌లో వచ్చిన వసూళ్లే కారణం. ఈసారి కూడా ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగానే నార్త్ ఆడియన్స్ నుంచి కాంతార చాప్టర్ 1కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో హిందీలో కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండు రోజుల్లో కాంతార చాప్టర్ 1 ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..

Kantara Chapter 1 Hindi Collection rishab Shetty s film get Decent Number at North

కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్
కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 169 కోట్ల రూపాయలు, కేరళలలో 20 కోట్ల రూపాయలు, తమిళనాడులో 13 కోట్ల రూపాయలు, హిందీలో 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 44.5 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా 440 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారీ అంచనాల మధ్య కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు. హిందీ మార్కెట్‌లో కాంతార చాప్టర్ 1 బ్రేక్ ఈవెన్ కావాలంటే 97 కోట్ల రూపాయల షేర్, 200 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

కాంతార చాప్టర్ 1 హిందీ కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కు తొలి రోజున హిందీలో 18.5 కోట్ల రూపాయలు, రెండో రోజున 12 కోట్ల రూపాయలు చొప్పున రెండ్రోజుల్లో 31 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. గతంలో 2022లో కాంతార చిత్రం తొలి రోజున హిందీలో కేవలం 1.22 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టగా.. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 దాని కంటే ఏకంగా 1356 శాతం వసూళ్లు రాబట్టింది. అలాగే తొలిరోజున వసూళ్లతో కాంతార చాప్టర్ 1 చిత్రం.. ప్రభాస్ సలార్ రికార్డ్‌ను బద్ధలు కొట్టింది. హిందీలో టాప్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల్లో సలార్ (15.50 కోట్ల రూపాయలు) 7వ స్థానంలో ఉండగా.. 18.50 కోట్ల రూపాయల ఓపెనింగ్స్‌తో రిషబ్ శెట్టి మూవీ ఆ ప్లేస్‌ను ఆక్రమించింది. అయితే ఈ చిత్రం హిందీ బెల్ట్‌లో ఇంకా చెప్పుకోదగిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శని, ఆదివారాల్లో అంచనాలకు తగిన విధంగా రిషబ్ శెట్టి మూవీ గర్జించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
కాగా.. ఇండియా వైడ్‌గా కాంతార చాప్టర్ 1కు తొలి రోజున 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 46 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఈ వసూళ్లతో రిషబ్ శెట్టి మూవీ కేవలం రెండ్రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇండియా వైడ్‌గా ఈ సినిమా రెండ్రోజుల వరకు 108 కోట్ల రూపాయల నెట్.. 120 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఇక నార్త్ అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా ఓవర్సీస్‌ మార్కెట్‌లో ఇప్పటి వరకు 13.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. దాంతో కాంతార చాప్టర్ 1 చిత్రం రెండ్రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 134 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో వసూళ్లను పరిశీలిస్తే కన్నడంలో 34 కోట్ల రూపాయలు, హిందీలో 31 కోట్ల రూపాయలు, తెలుగులో 25 కోట్ల రూపాయలు, తమిళంలో 11 కోట్ల రూపాయలు, మలయాళంలో 7 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 13.5 కోట్ల రూపాయలు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లాంగ్ రన్‌లో కాంతార చాప్టర్ 1 ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X