Kantara Chapter 1 Overseas Collection: ఓవర్సీస్‌లో కాంతార విధ్వంసం... విదేశాల్లో రిషబ్ శెట్టి సరికొత్త చరిత్ర
రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతార చాప్టర్ 1. గతంలో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా హోంబలే ఫిలింస్ అధినేతలు విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. భారత్‌లో కలెక్షన్ల విధ్వంసం సృష్టిస్తోన్న ఈ సినిమా ఓవర్సీస్‌లోనూ ప్రభంజనం సాగిస్తోంది. కాంతార చాప్టర్ 1 ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం వెనుక ఓవర్సీస్ మార్కెట్ కీలకపాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కాంతార ఓ అరుదైన ఘనత సాధించింది. ఈ వివరాల్లోకి వెళితే..
కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత?
కాంతార చాప్టర్ 1లో రిషబ్ శెట్టి సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించగా... జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాకు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా శాండల్‌వుడ్ వర్గాలు తెలిపాయి.

కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్
రిషబ్ శెట్టి మూవీకి ఓవర్సీస్‌లో 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దీంతో ఇక్కడ కాంతార చాప్టర్ 1 లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 95 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయలు, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 440 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కాంతార. దాంతో రిషబ్ శెట్టి మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.
కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కు పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఇండియా వైడ్‌గా తొలి రోజున 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 45.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 63 కోట్ల రూపాయలు, ఐదో రోజున 31.5 కోట్ల రూపాయలు, ఆరో రోజున 34.25 కోట్ల రూపాయలు, ఏడో రోజున 25 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 21.25 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 22.35 కోట్ల రూపాయలు, పదో రోజున 39 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 39.75 కోట్ల రూపాయలు, పన్నెండవ రోజున 13.5 కోట్ల రూపాయలు, పదమూడవ రోజున 14 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 465.75 కోట్ల రూపాయల నెట్, 556 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే 11 రోజుల వరకు కాంతార చాప్టర్ 1 వరల్డ్ వైడ్‌గా 665 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు హోంబలే ఫిలింస్ తెలిపింది.
ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో కాంతార కలెక్షన్స్ పరిశీలిస్తే... కర్ణాటకలో 146.45 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 79.8 కోట్ల రూపాయలు, హిందీలో 155.35 కోట్ల రూపాయలు, తమిళనాడులో 47.4 కోట్ల రూపాయలు, కేరళలో 36.75 కోట్ల రూపాయల చొప్పున వసూలు చేసింది. ఈ కలెక్షన్స్‌తో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో సైయారాను (570.67 కోట్ల రూపాయలు) అధిగమించి కాంతార రెండో స్థానంలో నిలిచింది. 827.6 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో ఛావా టాప్ ప్లేస్‌లో నిలిచింది.
కాంతార చాప్టర్ 1 ఓవర్సీస్ కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1 మూవీ రిలీజ్‌కు ముందు నుంచే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. నార్త్ అమెరికాలో రిలీజైనప 24 గంటల్లోనే ప్రీమియర్స్ + అడ్వాన్స్ బుకింగ్ కలిపి 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన కాంతార... మూడు రోజుల్లో 2 మిలియన్లు రాబట్టింది. ఆ తర్వాత తన జోరు చూపిస్తూ 14 రోజుల వరకు నార్త్ అమెరికాలో 4.3 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 38.09 కోట్ల రూపాయలు) వసూళ్లను సాధించాడు రిషబ్ శెట్టి. మిగిలిన యూకే, ఆస్ట్రేలియా, యూరప్, మిడిల్ ఈస్ట్, గల్ఫ్, న్యూజిలాండ్ తదితర దేశాలలో కలిపి 62 కోట్లు రాబట్టింది.
దాంతో కాంతార చాప్టర్ 1 పద్నాలుగు రోజుల్లో 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అరుదైన ఘనతను సాధించింది. ఓవర్సీస్‌లో 100 కోట్ల రూపాయల మార్క్ రాబట్టిన కన్నడ చిత్రాల్లో కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాతి స్థానంలో నిలిచింది. అలాగే 2025లో ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో 5వ స్థానంలో నిలిచింది. కూలీ 180 కోట్ల రూపాయలతో టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత సైయారా (171.50 కోట్ల రూపాయలు), ఎంపురాన్ (142.25 కోట్ల రూపాయలు), లోక చాప్టర్ 1 (119.60 కోట్ల రూపాయలు) కాంతార కంటే ముందున్నాయి. మరి థియేట్రికల్ రన్ ముగిసేసరికి కాంతార చిత్రం ఓవర్సీస్‌లో ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











