Kantara Overseas Collection: నార్త్ అమెరికాలో కాంతార రూలింగ్.. ఓవర్సీస్‌లో రిషబ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
కాంతారకు ప్రీక్వెల్‌గా హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు నిర్మించిన చిత్రం కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి స్వయంగా దర్శకుడిగా, హీరోగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. రుక్మిణి వసంత్ ఈ సినిమాలో రిషబ్ శెట్టికి హీరోయిన్‌గా నటించారు. 4 రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కన్నడం, హిందీతో పాటు ఓవర్సీస్‌లోనూ రిషబ్ శెట్టి మూవీ సాలీడ్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా. కాంతార చాప్టర్ 1 స్పీడ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో పెను ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంతార చాప్టర్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఓవర్సీస్‌లో 5 రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే..
కాంతార చాప్టర్ 1లో జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాకు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లుగా చెబుతున్నారు. కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది. కాంతార చాప్టర్ 1 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారీ అంచనాల మధ్య కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.
కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్ పరిశీలిస్తే.. రిషబ్ శెట్టి మూవీకి పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఇండియా వైడ్ తొలి రోజున 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 46 కోట్ల రూపాయలు, మూడో రోజున 55.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 63 కోట్ల రూపాయలు, ఐదో రోజున 31.25 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఐదు రోజుల వరకు కాంతార చాప్టర్ 1కు ఇండియాలో 256.5 కోట్ల రూపాయల నెట్.. 307 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. కన్నడంలో 75.85 కోట్ల రూపాయలు, తెలుగులో 52.75 కోట్ల రూపాయలు, హిందీలో 82.25 కోట్ల రూపాయలు, తమిళంలో 24.75 కోట్ల రూపాయలు, మలయాళంలో 20.9 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది.
కాంతార చాప్టర్ 1 ఓవర్సీస్ వసూళ్లు
రిలీజ్‌కు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఓవర్సీస్‌లో సంచలనం సృష్టించింది కాంతార చాప్టర్ 1. ప్రత్యేకించి నార్త్ అమెరికాలో రిషబ్ శెట్టి మూవీకి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. నార్త్ అమెరికాలో రెండ్రోజుల్లోనే 2 మిలియన్ల క్లబ్‌లో అడుగుపెట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఐదో రోజు రాత్రి 7 గంటల వరకు యూఎస్ఏ, కెనడాలో కాంతార చాప్టర్ 1కు 146K డాలర్లు (భారత కరెన్సీలో 1.29 కోట్ల రూపాయలు) కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా 5 రోజుల వరకు రిషబ్ శెట్టి మూవీకి 2.6 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో 23.7 కోట్ల రూపాయలు) వసూళ్లు సాధించినట్లు కాంతార నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగిరా ఫిలింస్ ప్రకటించింది.
ఇక యూకే, యూరప్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, గల్ఫ్ , మిడిల్ ఈస్ట్ దేశాలలో రిషబ్ శెట్టి మూవీకి 33 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా 5 రోజుల వరకు ఓవర్సీస్‌లో కాంతార చాప్టర్ 1కు 56 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం వేగంగా 300 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరడానికి ఓవర్సీస్ మార్కెట్ కీలకంగా వ్యవహరించింది. మరి రానున్న రోజుల్లో కాంతార చాప్టర్ 1 ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











