Kantara 2 USA Box Office: యూఎస్ఏలో కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల ఊపు.. రిలీజ్‌కు ముందే ఎంతంటే?

కన్నడ చిత్ర పరిశ్రమ రూపు రేఖల్ని సమూలంగా మార్చేసి శాండిల్‌వుడ్ రేంజ్‌ను పెంచిన సినిమాగా నిలిచింది కేజీఎఫ్. దీనిని కంటిన్యూ చేస్తూ కన్నడ పరిశ్రమ సత్తా ఇది అని చూపించిన మరో మూవీ కాంతార. నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం రూ.14 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కాంతార బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.450 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోన్న మూవీ కాంతార చాప్టర్ 1.

అక్టోబర్ 2న కాంతార 2
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు దాదాపు రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో కాంతార చాప్టర్ 1ను నిర్మిస్తున్నారు. రిషభ్ శెట్టి, జయరాంలు కీలకపాత్రలు పోషిస్తుండగా.. రుక్మీణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న కాంతార చాప్టర్ 1ను విడుదల చేయనున్నారు. కన్నడంతో పాటు తెలుగు, తమిళ, బెంగాలీ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Kantara Chapter 1 USA Advance Booking Rishab Shetty Movie Crosses 1 5 Crore In Pre-Sales

కాంతార చాప్టర్ 1 బిజినెస్
ఇక కాంతారకు కర్ణాటకతో సమానమైన ఆదరణ తెలుగు రాష్ట్రాల్లోనూ దక్కింది. ఈ క్రమంలోనే కాంతార చాప్టర్ 1 పైనా మన దగ్గర భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. ఫిలింనగర్ వర్గాలు చెబుతున్న దానిని బట్టి కాంతార చాప్టర్ 1 తెలుగు థియేట్రికల్ రైట్స్ 100 కోట్లకు పైగా పలుకుతున్నాయట. నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లుగా చెబుతున్నారు. కాంతార తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

రిలీజ్‌కు ముందే భారీ లాభాలు
ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ, హిందీ, తమిళనాడు, కేరళ, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్, ఆడియో, శాటిలైట్, ఓటీటీ రైట్స్ కలిపి కాంతార చాప్టర్ 1కు వరల్డ్ వైడ్‌గా 370 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటికే పెట్టుబడి మీద 245 కోట్ల రూపాయల లాభం వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 2న వరల్డ్ వైడ్‌గా దాదాపు 7 వేల థియేటర్‌లలో కాంతార చాప్ట్ 1 రిలీజ్ కానుంది. దానికి ముందు రోజు (అక్టోబర్ 1)న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయి.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో కాంతార చాప్టర్ 1 రికార్డ్
ఓవర్సీస్‌లో కాంతార చాప్టర్ 1కు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. అప్పుడే ఈ సినిమా దుమ్మురేపుతోంది. అమెరికాలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఏకంగా 1.5 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రిలీజ్‌కు ఇంకా 6 రోజుల సమయం ఉండటంతో కాంతార చాప్టర్ 1కు మరిన్ని కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. గతంలో వచ్చిన కాంతార 1 మిలియన్ మార్క్ వసూళ్లతో అమెరికన్ బాక్సాఫీస్ వద్ద ఈ ఘనత సాధించిన తొలి కన్నడ సినిమాగా నిలిచింది. మరి కాంతార చాప్టర్ 1 ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X