Kantara Total Collections: కాంతార టోటల్ కలెక్షన్స్.. కాంతార చాప్టర్ 1తో రిషబ్ ఆ రికార్డ్ బ్రేక్ చేస్తాడా?

కాంతారకు ప్రీక్వెల్‌గా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంతో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 2వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపుతోన్న ఈ మూవీ మరిన్ని రికార్డుల్ని బద్ధలు కొట్టింది. కాంతార చాప్టర్ 1 రిలీజ్ నేపథ్యంలో కాంతార కలెక్షన్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రెండేళ్ల క్రితం కాంతార బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు రాబట్టింది? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కాంతార టోటల్ థియేట్రికల్ రన్‌లో ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

కాంతారలో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించగా.. కిశోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాశ్ తుమ్మినాడ్, నవీన్ పిళ్లై, షైన్ శెట్టిలు కీలకపాత్రలు పోషించారు. కాంతారకు అజనీష్ లోకనాథ్ సంగీత దర్శకత్వం వహించగా.. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫి అందించారు. కేఎం ప్రకాష్, శోభిత్ శెట్టిలు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు కాంతారను నిర్మించారు. 2022 సెప్టెంబర్ 30వ తేదీన కాంతార ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

Kantara Movie Total Collections Worldwide Rishab Shetty s Movie Budget Overal Collection and Target for Kantara Chapter 1

కాంతార బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌, ప్రచార కార్యక్రమాలతో కలిపి కాంతారకు దాదాపు 16 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలంటే 35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. తెలుగు రాష్ట్రాల్లో కాంతారకు 2 కోట్ల రూపాయల బిజినెస్ జరగ్గా.. ఆంధ్రా, నైజాంలలో ఈ సినిమాకు 3 కోట్ల రూపాయల్ని బ్రేక్ ఈవెన్‌గా నిర్దేశించారు.

కాంతార కలెక్షన్స్
ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కాంతార చిత్రం.. థియేటర్‌లో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. కర్ణాటకలో 168.50 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల రూపాయలు, తమిళనాడులో 12.72 కోట్ల రూపాయలు, కేరళలో 19.20 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 44.50 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 96 కోట్ల రూపాయలు రాబట్టింది. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఇండియాలో 309.64 కోట్ల రూపాయల నెట్.. 363.82 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టగా.. వరల్డ్ వైడ్‌గా 407.9 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

తెలుగు రాష్ట్రాల్లో కాంతార కలెక్షన్స్
నైజాంలో 14.03 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3.44 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 3.90 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 2.22 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 1.38 కోట్ల రూపాయలు, గుంటూరులో 1.85 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 1.80 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.03 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రన్ ముగిసేసరికి 29.65 కోట్ల రూపాయల షేర్.. 58.60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

వరల్డ్ వైడ్‌గా కాంతారకు లాభమెంత?
తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు గాను ఇక్కడ ఏకంగా 30 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది కాంతార. దీంతో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లకు రిషబ్ శెట్టి మూవీ ఏకంగా 27 కోట్ల రూపాయల లాభాలను అందించింది. ఇక వరల్డ్ వైడ్‌గా 35 కోట్ల రూపాయల షేర్‌కు గాను దాదాపు 220 కోట్ల రూపాయల షేర్ రాబట్టి.. ఓవరాల్‌గా 180 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది కాంతార.

కాంతార చాప్టర్ 1 ఎదుట భారీ టార్గెట్
కాంతారకు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోన్న కాంతార చాప్టర్ 1పై కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, వరల్డ్ వైడ్‌గా భారీ అంచనాలు నెలకొన్నాయి. కాంతార కలెక్షన్స్ రికార్డులను కాంతార చాప్టర్ 1 ఖచ్చితంగా బద్ధలుకొట్టి కొత్త చరిత్ర సృష్టిస్తుందని భావిస్తున్నారు. కాంతార చాప్టర్ 1లో రిషబ్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు దాదాపు రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో కాంతార చాప్టర్ 1ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తిస్తున్నారు.

అంచనాలకు తగినట్లుగానే కాంతార చాప్టర్ 1 అడ్వాన్స్ బుకింగ్స్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో అక్టోబర్ 1వ తేదీన ప్రీమియర్స్ పడనున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ ప్రీమియర్స్ షో టికెట్లు వేగంగా బుక్ అవుతున్నాయి. ఇప్పటికే ఇండియాలో ప్రీ సేల్స్ ద్వారా 15 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లుగా సాక్‌నిక్ తెలిపింది. బ్లాక్ చేసిన సీట్స్‌తో కలిపి ఈ మొత్తం 24 కోట్ల రూపాయల పైనే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంతార చాప్టర్ 1 ఖచ్చితంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X