'ఖైదీ' ఫైనల్ రిపోర్ట్.. ఊహించని రీతిలో లాభాలు.. ఎంత రాబట్టిందో తెలుసా?
తమిళ హీరో కార్తీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఖైదీ' మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో హవా కొనసాగించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఫైనల్ రిపోర్ట్‌లో భారీ లాభాలు నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండించింది. ఆ వివరాలు చూద్దామా..

అరుదైన ఫీట్.. భారీ రేంజ్‌లో కలెక్షన్స్
సాధారణంగా తమిళం నుంచి తెలుగులోకి రీమేక్ చేయబడిన సినిమాలు భారీ సక్సెస్ సాధించడమనేది అరుదైన విషయమే. అలాంటి అరుదైన ఫీట్ సాధించింది 'ఖైదీ' సినిమా. విడుదలైన రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాత మెల్లగా పుంజుకుంది. పాజిటివ్ టాక్‌తో భారీ రేంజ్‌లో కలెక్షన్స్ రాబట్టింది.

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగు, తమిళ భాషల్లో
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఖైదీ' సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు వచ్చిన కలెక్షన్ రిపోర్ట్ చిత్రయూనిట్ అందరిలో జోష్ నింపింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఖైదీ
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 'ఖైదీ' సినిమా 7.05 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. విడుదలైన అన్ని ఏరియాల్లో పాజిటివ్ బజ్‌తో ఈ మేర వసూళ్లు రాబట్టింది ఖైదీ మూవీ. విడుదలకు ముందు ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ కేవలం 3.5 కోట్లకు అమ్ముడయ్యాయి. అంతే ఈ లెక్కన పెట్టిన దానికి డబుల్ వసూలు చేసి సంచలనం సృష్టించింది ఖైదీ సినిమా.

ఏయే ఏరియాల్లో ఎంతెంత?
ఇక ఏరియాల పరంగా చూస్తే.. నైజాం 2.20 కోట్లు, సీడెడ్ 90 లక్షలు, ఉత్తరాంధ్ర 1.25 కోట్లు, గుంటూరు 70 లక్షలు, తూర్పుగోదావరి 50 లక్షలు, పశ్చిమ గోదావరి 40 లక్షలు, కృష్ణా 80 లక్షలు, నెల్లూరు 30 లక్షలు, మొత్తంగా చూస్తే 7.05 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది ఖైదీ మూవీ.
Recommended Video

100 శాతం లాభం.. నిర్మాత ఖుషీ ఖుషీ
ఖైదీ చిత్ర తెలుగు విడుదల హక్కులను ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా ఆయనకు 100 శాతం లాభం చేకూరింది. దీంతో ఆయన ఫుల్ ఖుషీ అవుతున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











