twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ లెక్కలు.. బడ్జెట్, బిజినెస్ వివరాలు.. నిర్మాతకు వచ్చింది ఎంతంటే?

    |

    ప్రస్తుతం మారిన పరిస్థితుల కారణంగా సినిమా బిజినెస్ లెక్కల్లోనూ భారీ వ్యత్యాసం వస్తుంది. ఇంతకుముందులా ఫస్ట్ డే రికార్డులు, వీకెండ్ కలెక్షన్లు అని లెక్కలు ఉండకపోవచ్చు. ఎందుకంటే కరోనా ఎప్పుడు తగ్గుతుందో తెలియడం లేదు.. థియేటర్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయో అసలే తెలియడం లేదు. థియేటర్స్ ఓపెన్ అయితే మునుపటిలా హంగామా ఉంటుందో కూడా తెలియడం లేదు. అందుకే కొందరు నిర్మాతలు ఓటీటీ వైపు దృష్టిసారించారు. అందులో భాగంగా రిలీజైన పెద్ద చిత్రం పెంగ్విన్.

     కీర్తి సురేష్ క్రేజ్..

    కీర్తి సురేష్ క్రేజ్..

    పెంగ్విన్ చిత్రానికి ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ కీర్తి సురేష్. మహానటి తరువాత చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడమే పెద్ద శాపం. ఒకవేళ థియేటర్స్‌లో రిలీజ్ చేసి ఉంటే.. దక్షిణాదిన భారీ ఎత్తులో రిలీజ్ చేసేవారు. కలెక్షన్లు కూడా అదే రేంజ్‌లో ఉండేవి.

    లో బడ్జెట్..

    లో బడ్జెట్..

    పెంగ్విన్ చిత్రాన్ని అత్యంత తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించడం కలిసి వచ్చే అంశం. కీర్తి సురేష్ మినహా పెద్ద క్యాస్టింగ్ లేకపోవడం, లొకేషన్లు అంటూ ఎక్కడెక్కడికో తిరగాల్సిన పని లేకుండా ఒకే చోట షూటింగ్ చేయడం ఇలా కొన్ని కారణాల వల్ల బడ్జెట్ తక్కువగానే అయిందంటా. మొత్తంగా ఈ చిత్రానికి నాలుగు కోట్ల వరకు బడ్జెట్ పెట్టారని టాక్..

    అమేజాన్‌లో ఫ్యాన్సీ రేటు..

    అమేజాన్‌లో ఫ్యాన్సీ రేటు..

    కీర్తి సురేష్‌కు ఉన్న క్రేజ్‌ను బట్టి అమేజాన్ ప్రైమ్ పెంగ్విన్ చిత్రానికి మంచి రేటునే ఆఫర్ చేసిందంటా. మొదటగా 7.5 కోట్ల‌కు అమేజాన్ సొంతం చేసుకున్న‌ట్టు టాక్‌. ఆపై వ్యూవ‌ర్ షిప్ ని బ‌ట్టి, ఆ త‌ర‌వాత ఆదాయాన్ని షేర్ చేయ‌డానికి అమేజాన్ ఒప్పుకుంద‌ట‌. ఇన్ని ల‌క్ష‌ల గంట‌ల‌కు ఇంత మొత్తం అని ముందే అమెజాన్ `పెంగ్విన్‌` నిర్మాత‌తో ఒప్పందం చేసుకుంద‌ట‌.

    పర్వాలేదనిపించిన పెంగ్విన్..

    పర్వాలేదనిపించిన పెంగ్విన్..

    అయితే పెంగ్విన్ చిత్రమేమీ అంత పెద్దగా టాక్ ఆఫ్ ది టౌన్ అనిపించలేదని తెలుస్తోంది. ప్రథమార్ధం మెప్పించినా ద్వితీయార్థం, క్లైమాక్స్ మైనస్‌గా నిలవడంతో పెంగ్విన్ యావరేజ్‌గానే మిగిలింది. దీంతో విడుదలైన రెండు మూడు రోజులు మాత్రమే పెంగ్విన్ హవా కొనసాగింది.

    Recommended Video

    షాకింగ్ Fact About The Annual ఇన్ కమ్ Of Keerthy Suresh
     అన్ని లెక్కలు వేస్తే..

    అన్ని లెక్కలు వేస్తే..

    ఇక రీసెంట్‌గా శాటిలైట్ రైట్స్ టాప్ చానెల్‌ మంచి రేటుకే సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అన్ని భాషలు కలిపి 6 కోట్ల రేంజ్‌లో డీల్ జరిగిందని టాక్. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడు పోవాల్సి ఉండగా ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ 13.5 కోట్లు కాగా పెట్టిన 4 కోట్ల రేంజ్ బడ్జెట్ కి 9 కోట్లకు పైగానే లాభం దక్కినట్లు లెక్క. హిందీ డబ్బింగ్ రైట్స్‌కు కూడా మంచి రేటు దక్కితే 10 కోట్లకు పైగానే భారీ ప్రాఫిట్ నిర్మాత జేబులోకి వెళ్తుందన్న మాట.

    English summary
    Keerthy Suresh Penguin Box Office Report. Penguin is a 2020 Indian mystery thriller film written and directed by Eashvar Karthic in his directorial debut and co-produced by Karthik Subbaraj.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X