twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF 2 రూ.1097 కోట్లు.. హీరో డైరెక్టర్ కు భారీగా ఆదాయం.. లాభాల్లో వాటా ఎంతంటే?

    |

    ఒక కన్నడ సినిమా మొదటిసారి దేశవ్యాప్తంగా ఎవరు ఊహించని రేంజ్ లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబల్ ఫిలిమ్స్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్ర KGF రెండు చాప్టర్స్ కూడా పెట్టిన పెట్టుబడులకు అందరికి లాభాలను అంధించాయి. ఇక రెండవ చాప్టర్ సినిమా ఇటీవల వెయ్యి కోట్ల వసూళ్లను దాటగా హీరోకి అలాగే దర్శకుడికి కూడా మంచి ఆదాయం లభించినట్లు తెలుస్తోంది. వారి రెమ్యునరేషన్ అలాగే లాభాల్లో వాటా ఎంత వచ్చింది అనే వివరాల్లోకి వెళితే...

    అలాంటి టాక్ వచ్చినప్పటికీ..

    అలాంటి టాక్ వచ్చినప్పటికీ..


    కన్నడ పాన్ ఇండియా మూవీ KGF 2 విడుదలైన మొదటిరోజే ఓ వర్గం ఆడియెన్స్ నుంచి కొంత డివైడ్ టాక్ అయితే అందుకుంది. అంచనాలకు తగ్గట్టుగా సంతృప్తి పరచలేదు అని అన్నారు. దీంతో సినిమా కలెక్షన్స్ అనుకున్నంతగా రాకపోవచ్చని కథనాలు కూడా వెలువడ్డాయి. కానీ ఆ టాక్ కు భిన్నంగా KGF బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది.

    కలెక్షన్స్ ఎంతంటే?

    కలెక్షన్స్ ఎంతంటే?

    KGF 2 బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయలను దాటేసి దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక కన్నడ లో నెంబర్ ఫిల్మ్ గా రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా 27 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1097కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను అందుకుంది.

    వచ్చిన షేర్ ఎంత?

    వచ్చిన షేర్ ఎంత?

    మొత్తానికి సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు 600కోట్ల నుంచి 700కోట్ల మధ్యలో షేర్ వసూళ్లను అందించినట్లు సమాచారం. పెట్టిన పెట్టుబడులకు ఇది డబుల్ ప్రాఫిట్ అనే చెప్పాలి. ముఖ్యంగా హిందీలో అయితే చాలా ఎక్కువ వసూళ్లను అందుకొని అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

     రెమ్యునరేషన్ ఎంత?

    రెమ్యునరేషన్ ఎంత?


    ఇక ఈ సినిమా ద్వారా దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో యష్ ఏ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నారు అలాగే లాభాల్లో ఎంత వాటా వచ్చింది అనే వివరాల్లోకి వెళితే.. ముందుగా హీరోకి అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇద్దరికి ఒకే తరహా రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. దాదాపు 25కోట్ల వరకు జీతంగా ఇచ్చినట్లు టాక్. అనంతరం లాభాల్లో వాటా ఇవ్వడానికి నిర్మాతలతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.

    లాభాల్లో 20% షేర్

    లాభాల్లో 20% షేర్


    ఇటీవల కాలంలో చాలామంది దర్శకులు హీరోలు రెమ్యునరేషన్ కంటే కూడా సక్సెస్ అయిన అనంతరం లాభాల్లో వాటా తీసుకునేందుకు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఇక అదే తరహాలో ప్రశాంత్ నీల్ యష్ KGF సినిమాకుకు వచ్చిన లాభాల్లో 20% షేర్ తీసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నారు.

    హీరో, డైరెక్టర్ మొత్తం ఆదాయం ఎంతంటే?

    హీరో, డైరెక్టర్ మొత్తం ఆదాయం ఎంతంటే?

    ఇక ఇప్పుడు 600కోట్లకు పైగా షేర్ రావడంతో ఈ ఇద్దరికి 120 నుంచి 140కోట్ల మధ్యలో వాటా వచ్చినట్లు టాక్. అంటే రెమ్యునరేషన్ తో కలుపుకొని మొత్తంగా KGF 2 సినిమాకు వీరికి 150కోట్ల వరకు ఆదాయం దక్కినట్లు సమాచారం. ఇక ఈ సినిమా ప్రభావంతో వీరి భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించిన రెమ్యునరేషన్ సంఖ్య కూడా ఎక్కువయ్యే అవకాశం ఉండిమ్ చూస్తుంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ అనంతరం ఎన్టీఆర్ సినిమాకు 200కోట్ల ఆదాయం అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

    English summary
    KGF 2 movie total box office collections and hero gaan director prashanth neel remuneration details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X