twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF2 day 4 collections వెండితెరపై ఇండియన్ సీఈవోప్రభంజనం.. 500 కోట్ల క్లబ్‌లో రాకీ భాయ్!

    |

    KGF Chapter 2 చిత్రం ఆంధ్రా, తెలంగాణ, కన్నడ, తమిళం, హిందీ అనే తేడా లేకుండా కలెక్షన్ల సునామీని కొనసాగిస్తున్నది. రాకింగ్ స్టార్ యష్ యాటిట్యూడ్, ప్రశాంత్ నీల్ టేకింగ్ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరిస్తుండటంతో రికార్డు వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబడుతున్న కేజీఎఫ్2 చిత్రం ఆదివారం రోజు కూడా అదే ఊపును కొనసాగించింది. KGF2 4వ రోజు సాధించిన కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

    తొలి కన్నడ చిత్రంగా రికార్డు

    తొలి కన్నడ చిత్రంగా రికార్డు

    కన్నడ డబ్బింగ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన KGF Chapter 2 చిత్రం హిందీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలువడమే కాకుండా ఆల్‌టైమ్ ఓపెనింగ్స్ సాధించింది. 500 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి కన్నడ చిత్రంగా ఘనతను సాధించింది. తొలివారాంతం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులను తిరగరాస్తున్నది.

    తమిళనాడులో

    తమిళనాడులో

    తమిళనాడులో కేజీఎఫ్2 చిత్ర ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఆదివారం అంటే సెప్టెంబర్ 17వ తేదీన 12.38 కోట్లు రాబట్టింది. తమిళనాడులో కేజీఎఫ్2 కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజున 8.24 కోట్లు, రెండో రోజున 10.61 కోట్లు, మూడో రోజున 11.50 కోట్లు, నాలుగో రోజున 12.38 కోట్లు వసూలు చేసింది. దాంతో 42.73 కోట్లు వసూళ్లను నమోదు చేసింది. సోమవారం ఈ సినిమా 50 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

    హిందీలో వసూళ్ల సునామీ

    హిందీలో వసూళ్ల సునామీ

    KGF Chapter 2 మూవీ హిందీ ప్రాంతంలో చరిత్ర క్రియేట్ చేస్తున్నది. అతివేగంగా 200 కోట్లు వసూళ్లు సాధిచంిన తొలి చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఐదో రోజున ఈ చిత్రం 200 కోట్ల క్లబ్‌లో చేరింది. హిందీ వెర్షన్‌కు సంబంధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజున 53.95 కోట్లు, రెండో రోజున 46.79 కోట్లు, మూడో రోజున 42.90 కోట్లు, నాలుగో రోజున 50.35 కోట్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం193.99 కోట్లు సాధించింది. ఇక ఐద రోజు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లతో 200 కోట్ల గ్రాస్ రాబట్టింది.

    నైజాం, ఆంధ్రలో 4వ రోజు

    నైజాం, ఆంధ్రలో 4వ రోజు

    తెలుగు రాష్ట్రాల్లో KGF Chapter 2 చిత్రం 4వ రోజు కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో 5.50 కోట్లు, సీడెడ్‌లో 1.31 కోట్లు, ఉత్తరాంధ్రలో 96 లక్షలు, తూర్పు గోదావరి 1.05 కోట్లు, పశ్చిమ గోదావరి 47 లక్షలు, గుంటూరులో 62 లక్షలు, కృష్ణ జిల్లాలో 58 లక్షలు, నెల్లూరు జిల్లాలో 32 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 4వ రోజున 10.81 కోట్లు షేర్, 16.80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజుల కలెక్షన్లు

    తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజుల కలెక్షన్లు

    తెలుగు రాష్ట్రాల్లో KGF Chapter 2 రాబట్టిన రోజువారి కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజున 19.09 కోట్లు, రెండో రోజున 13.37 కోట్లు, మూడో రోజున 10.29 కోట్లు, నాలుగో రోజున 10.81 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 53.56 కోట్ల షేర్, 84.80 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

     కర్ణాటక, తమిళనాడు, ఇతర ప్రాంతాల్లో

    కర్ణాటక, తమిళనాడు, ఇతర ప్రాంతాల్లో

    ఇక KGF Chapter 2 చిత్రం ఇతర ప్రాంతాల్లో సాధించిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో 53.4 కోట్ల గ్రాస్, తమిళనాడులో 15.20 కోట్లు, కేరళ 12.05 కోట్లు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 96.70 కోట్ల షేర్ సాధించింది. ఇక ఓవర్సీస్‌లో 46.90 కోట్లు రాబట్టడంతో ఈ సినిమా 277.81 కోట్ల షేర్‌ను సాధించింది.

    బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..

    బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..

    KGF Chapter 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 345 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా 277.81 కోట్లు షేర్.. 550 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. అంతే ఇంకా ఈ చిత్రం సుమారు 65 కోట్ల మేర షేర్ సాధిస్తే.. లాభాల్లోకి వస్తుంది. 5వ రోజున ఈ మూవీ లాభాల్లోకి ప్రవేశించే ఛాన్స్ కనిపిస్తున్నది.

    English summary
    Director Prashanth Neel and Yash's KGF Chapter 2 has released on April 14th. This film collected 550 crores worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X