Don't Miss!
- News
Cap: నిద్రలో గురకను కంట్రోల్ చేసి మ్యాజిక్ టోపీ, టోపీ పెట్టుకుంటే గురక టక్కున ఆగిపోతుంది. వామ్మో !
- Finance
Bank Strike: SBI ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా మూడు రోజులు బ్యాంక్స్ క్లోజ్..!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం సరైన ఫ్రెండ్‌ను కనిపెట్టడం ఎలాగంటే..
- Sports
INDvsNZ : అది అంత ఈజీ కాదు.. అతన్ని తొలి టీ20 ఆడించాలన్న మాజీ లెజెండ్!
- Automobiles
బుల్లితెర నటి 'శ్రీవాణి' కొన్న కొత్త కారు, ఇదే: చూసారా..?
- Technology
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
KGF Chapter 2 Day 40 Collections: వసూళ్ళలో భారీ డ్రాప్.. 40వ రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?
కేజిఎఫ్ సినిమాతో కన్నడ సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు ప్రశాంత్ నీల్. అప్పటివరకు కన్నడ సినీ పరిశ్రమ ఒకటి ఉంటుందని తెలుసు కానీ అక్కడ సినిమాల మీద ఏమాత్రం దృష్టి పెట్టని భారతదేశానికి కన్నడ సినిమా సత్తాని ఒక్కసారిగా చాటిచెప్పారు. కోలార్ గోల్డ్ ఫీల్స్ అంటూ బంగారం మైనింగ్ నేపథ్యంలో కేజిఎఫ్ పార్ట్ వన్ రూపొందించగా ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తామని అప్పట్లోనే దర్శక నిర్మాతలు ప్రకటించారు. ప్రకటించిన విధంగానే ఏప్రిల్ 14వ తేదీన కేజిఎఫ్ 2 సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు.
ఆ సినిమా విడుదలైన నాటి నుంచి అనేక రికార్డులను కొల్లగొడుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 1200 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించిన ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు వెళుతోంది. ఈ సినిమాలో యష్ హీరోగా నటించగా ఆయన సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటించిన ఈ సినిమాలో రవీనా టాండన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించింది.
ప్రకాష్ రాజ్, రావు రమేష్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలై 40 రోజులు పూర్తయిన సందర్భంగా 40 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది పరిశీలిద్దాం. ఈ సినిమా కలెక్షన్లు పెరిగినట్టే పెరిగి మళ్లీ తగ్గుతున్నాయి.

వీకెండ్స్ లో కలెక్షన్లు పుంజుకుంటున్నాయి కానీ వీక్ డేస్ లో మాత్రం కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ సినిమా విడుదలైన తర్వాత సర్కారు వారి పాట సినిమా రావడంతో ఆ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తాయని అనుకున్నారు. కానీ ఆ సినిమా సత్తా చాట లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో 40వ రోజు కేవలం 3 లక్షలు మాత్రమే లభించాయి.
కేజీఎఫ్ 2 40 రోజుల కలెక్షన్లు చూస్తే నైజాంలో రూ. 42.86 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.01 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 07.91 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.58 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.64 కోట్లు, గుంటూరులో రూ. 4.92 కోట్లు, కృష్ణాలో రూ. 4.28 కోట్లు, నెల్లూరులో రూ. 2.82 కోట్లతో.. కలుపుకుని రూ. 84.05 కోట్లు షేర్, రూ. 136.48 కోట్లు గ్రాస్ వచ్చింది.
అలాగే, కర్నాటకలో రూ. 105.42 కోట్లు, తమిళనాడులో రూ. 55.10 కోట్లు, కేరళలో రూ. 32.27కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 222.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 100.33 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 40 రోజుల్లోనే రూ. 599.67 కోట్లు షేర్‌తో రాబట్టింది. క్రేజీ కాంబోలో వచ్చిన 'కేజీఎఫ్ 2' 40 రోజుల్లోనే ఓవరాల్‌గా 252.67 కోట్ల లాభాలు అందుకుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ళలో మొట్టమొదటిసారిగా డ్రాప్ కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా 40వ రోజు కేవలం 50 లక్షలు మాత్రమే వసూళ్లు వచ్చాయి.