twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కెజిఎఫ్’ తెలుగు రాష్ట్రాల్లో హిట్టా? ప్లాపా? క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే..

    |

    Recommended Video

    KGF Latest Telugu States Closing Collections Report | Filmibeat Telugu

    కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన 'కెజిఎఫ్' సాండల్ వుడ్ ఇండస్ట్రీలో సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు అక్కడ వంద కోట్ల రికార్డు కూడా ఒక్కటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసిన చరిత్ర సృష్టించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్ కిరంగదూర్ నిర్మాత.

    'కెజిఎఫ్' తెలుగు వెర్షన్ కూడా కన్నడతో పాటు రిలీజ్ చేశారు. డిసెంబర్ చివరి వారంలో విడుదలైన ఈ మూవీ థియేట్రికల్ రన్ దాదాపుగా క్లోజ్ అయింది. టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ఈ మూవీ ఎంత వసూలు చేసింది? డిస్ట్రిబ్యూటర్లకు ఎంత లాభం తెచ్చిందో ఓ లుక్కేద్దాం.

    కెజిఎఫ్ వసూళ్లు

    కెజిఎఫ్ వసూళ్లు

    ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలకు కలిపి టోటల్ డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 12.30 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కన్నడ డబ్బింగ్ చిత్రానికి తెలుగులో ఇంత షేర్ రావడం రికార్డుగా చెప్పుకుంటున్నారు.

    బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌పై రానా ట్వీట్.. ఆ సౌండ్ ట్రాక్‌కి ఫిదా అయిపోయా!బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌పై రానా ట్వీట్.. ఆ సౌండ్ ట్రాక్‌కి ఫిదా అయిపోయా!

    ఎంతకు కొన్నారు?

    ఎంతకు కొన్నారు?

    ‘కెజిఎఫ్' చిత్రాన్ని వారాహి చలన చిత్రం బేనర్లో సాయి కొర్రపాటి రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఆయన 5 కోట్లకు కొన్నట్లు తెలుస్తోంది. పెట్టిన పెట్టుబడికి రెట్టింపుకు మించిన లాభం రావడంతో టాలీవుడ్లో కూడా బ్లాక్ బస్టర్‌గా నమోదైంది.

    ఏరియా వైజ్ షేర్

    ఏరియా వైజ్ షేర్

    నైజాం: రూ. 4.80 కోట్లు, సీడెడ్ రూ. 2.40 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1.45 కోట్లు, గుంటూరు రూ. 90 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 72 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 60 లక్షలు, కృష్ణ రూ. 1.60 కోట్లు, నెల్లూరు రూ. 30 లక్షలు రాబట్టింది.

    ‘కెజిఎఫ్' చాప్టర్ 2పై భారీ అంచనాలు

    ‘కెజిఎఫ్' చాప్టర్ 2పై భారీ అంచనాలు

    త్వరలో కెజిఎఫ్ చాప్టర్ 2 విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని థియేట్రికల్ రైట్స్ రూ. 10 కోట్లకు మించి అమ్ముడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019 చివరి వరకు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

    English summary
    Yash starrer KGF has ended up it’s run in Telangana and AP with a distributor share of 12.30 Cr. The film is a huge blockbuster as the theatrical rights are valued for 5 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X