For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SR Kalyanamandapam Day 1 Collections: చిన్న మూవీకి ఊహించని కలెక్షన్లు.. సినీ పెద్దలే షాకయ్యేలా!

  |

  చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పున: ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో గత వారం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటికి భారీ స్థాయిలో కలెక్షన్లు రాకున్నా.. ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం బాగానే దక్కింది. దీంతో ఈ శుక్రవారం ఏకంగా 'ఎస్ఆర్ కల్యాణమండపం', 'మ్యాడ్', 'ముగ్గురు మొనగాళ్లు', ' మెరిసే మెరిసే', 'క్షీర సాగర మథనం', 'రావణలంక', 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' అనే చిత్రాలు విడుదల అయ్యాయి. ఇవన్నీ బాక్సాఫీస్ ముందు స్టామినాను బట్టి పోటీ పడుతున్నాయి. ఇక, ఇందులో చిన్నదే అయినా పెద్ద సినిమాగా వచ్చింది మాత్రం 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీనే. దీనికి ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డమే దీనికి కారణం. ఇక, ఈ మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ రిపోర్టును పరిశీలిద్దాం పదండి!

   ఫ్యామిలీ టచ్‌తో ‘ఎస్ఆర్ కల్యాణమండపం'

  ఫ్యామిలీ టచ్‌తో ‘ఎస్ఆర్ కల్యాణమండపం'

  ‘రాజావరు రాణీవారు' అనే సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘ఎస్ఆర్ కల్యాణమండపం'. శ్రీధర్ గాదె తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియాంక జావాల్కర్ హీరోయిన్‌గా నటించింది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఇందులో కీలక పాత్రను పోషించారు. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రమోద్, రాజు ఈ సినిమాను నిర్మించారు. దీనికి హీరో కిరణ్ అబ్బవరం కథ, స్క్రీన్‌ప్లే, మాటలను అందించాడు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

  Bigg Boss ఐదో సీజన్‌లో అతడికే ఎక్కువ: షో చరిత్రలో రికార్డు నమోదు.. ఆమెను వెనక్కి నెట్టేస్తూ!

  పేరున్న హీరో కాకున్నా.. భారీ అంచనాలు

  పేరున్న హీరో కాకున్నా.. భారీ అంచనాలు

  ‘ఎస్ఆర్ కల్యాణమండపం' సినిమాలో పేరున్న హీరో చేయలేదు. కానీ, ఈ మూవీ పేరు కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ఈ చిత్రంపై ఏర్పడ్డ అంచనాలే అని చెప్పొచ్చు. ఆ మధ్య విడుదలైన టీజర్, ఇటీవల వచ్చిన ట్రైలరే దీనిపై భారీ స్థాయిలో బజ్‌ను ఏర్పరిచాయి. అందుకే వీటికి రికార్డు స్థాయిలో వ్యూస్ రావడంతో పాటు ఇది ప్రతి ఒక్కరి కథ అనే టాక్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం యూత్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రంపై సినీ పెద్దలు సైతం దృష్టిని సారించారు.
  పేరున్న హీరో కాకున్నా.. భారీ అంచనాలు
  ‘ఎస్ఆర్ కల్యాణమండపం' సినిమాలో పేరున్న హీరో చేయలేదు. కానీ, ఈ మూవీ పేరు కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ఈ చిత్రంపై ఏర్పడ్డ అంచనాలే అని చెప్పొచ్చు. ఆ మధ్య విడుదలైన టీజర్, ఇటీవల వచ్చిన ట్రైలరే దీనిపై భారీ స్థాయిలో బజ్‌ను ఏర్పరిచాయి. అందుకే వీటికి రికార్డు స్థాయిలో వ్యూస్ రావడంతో పాటు ఇది ప్రతి ఒక్కరి కథ అనే టాక్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం యూత్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రంపై సినీ పెద్దలు సైతం దృష్టిని సారించారు.

  భారీ డిమాండ్... ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?

  భారీ డిమాండ్... ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?

  ‘ఎస్ఆర్ కల్యాణమండపం' సినిమాపై నెలకొన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమా హక్కుల కోసం చాలా మంది పోటీ పడ్డారు. దీంతో అన్ని ఏరియాల హక్కులు రికార్డు స్థాయి ధరలకు అమ్ముడు పోయాయి. ఫలితంగా ‘ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ ప్రీ రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ ఏరియాల్లో కలుపుకుని బిజినెస్ రూ. 4.55 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.80 కోట్లుగా ఫిక్సైంది. భారీ డిమాండ్ పలికిన సినిమా నైజాం ఏరియాలో దాదాపుగా 200, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 200 థియేటర్లు, యూఎస్‌లో 30 లొకేషన్స్‌లో విడుదల అయింది.

  సింగర్ సునీత పర్సనల్ ఫొటోలు: హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా.. ఆమెను మీరెప్పుడూ ఇలా చూసుండరు!

  సినిమా టాక్... ఫస్ట్ అలా.. తర్వాత ఇలా

  సినిమా టాక్... ఫస్ట్ అలా.. తర్వాత ఇలా

  కోవిడ్ సెకెండ్ వేవ్ తర్వాత భారీ అంచనాల నడుమ వచ్చిన చిత్రమే ‘ఎస్ఆర్ కల్యాణమండపం'. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విడుదలైన దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ప్రీమియర్ షోల సమయంలోనే ఇది బాగుందని చాలా మంది చెప్పారు. ఆ తర్వాత క్రమంగా దీని టాక్ మారింది. మరీ ముఖ్యంగా ల్యాగ్ ఎక్కువగా ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఎమోషనల్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయని మరికొందరు చెప్పారు. దీంతో ఈ సినిమాకు మొత్తంగా మిశ్రమ స్పందన వచ్చింది. సాయంత్రానికి కొంత ఎక్కువ రెస్పాన్స్ దక్కింది.

   తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూలు చేసింది?

  తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూలు చేసింది?

  ‘ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి స్థాయిలో షోలు నడవకున్నా.. తెలంగాణలో మాత్రం భారీగానే కొట్టేసింది. ఫలితంగా దీనికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ‘ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీకి నైజాం ఏరియాలో రూ. 98 లక్షలు గ్రాస్, రూ. 85 లక్షలు షేర్ వచ్చింది. అలాగే, ఉత్తరాంధ్రలో రూ. 27 లక్షలు గ్రాస్, రూ. 13 లక్షలు షేర్ దక్కింది. అలాగే, సీడెడ్‌లో రూ. 41 లక్షలు గ్రాస్, రూ. 28 లక్షలు షేర్ వసూళు అయినట్లు తెలుస్తోంది.

  తొలి రోజు మొత్తంగా వచ్చింది ఎంతంటే?

  తొలి రోజు మొత్తంగా వచ్చింది ఎంతంటే?

  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నడుమ ఏ సినిమాకైనా పెద్దగా కలెక్షన్లు వచ్చేలా కనిపించడం లేదు. గత వారం విడుదలైన సినిమాల బాక్సాఫీస్ రిపోర్టును చూసి అది అర్థం చేసుకోవచ్చు. అయితే, ‘ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీకి మాత్రం ఆశించిన దాని కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఈ సినిమాకు రూ. 1.20 కోట్ల వరకూ షేర్ వచ్చింది. అలాగే, ఓవర్సీస్ సహా మిగిలిన ప్రాంతాలను కలుపుకుంటే దాదాపు రూ. 1.40 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెంబర్స్ చూసి సినీ పెద్దలే షాక్ అవుతున్నట్లు సమాచారం.

  ప్రమాదానికి గురైన జబర్ధస్త్ వర్ష: ఆ నటుడు స్పీడుగా నడపడంతో ఘటన.. షాకిస్తోన్న వీడియో

  Kiran Abbavaram Birthday Special Interview | SR Kalyanamandapam | Sammathame
   బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఎంత రావాలి?

  బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఎంత రావాలి?

  ‘ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ ప్రీ రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ ఏరియాల్లో కలుపుకుని బిజినెస్ రూ. 4.55 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.80 కోట్లుగా ఫిక్సైంది. ఇక, మొదటి రోజు ఈ చిత్రానికి రూ. 1.40 కోట్ల వరకూ వచ్చినట్లు తెలుస్తోంది. అంటే.. ఇది హిట్‌గా నిలవాలి అంటే ఇంకా రూ. 3.40 కోట్లు రావాలి. ఇక, ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే టార్గెట్‌ను చేరుకునే అవకాశాలు ఉన్నాయన్న టాక్ విపిస్తోంది.

  English summary
  Kiran Abbavaram Now Did a Film SR Kalyanamandapam Under Sridhar Gade Direction. This Movie Collected Gross 98.32L in Day 1.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X