For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SR Kalyanamandapam 3Days Collections: ఆ హీరోల రేంజ్‌లో వసూళ్లు.. కేవలం 3 రోజుల్లోనే అన్ని కోట్లా!

  |

  గత ఏడాది సంక్రాంతి సీజన్ తర్వాత నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీ పరిస్థితి ఏమంత బాగోలేదు. రెండు సార్లు లాక్‌డౌన్ పెట్టడంతో థియేటర్లు మూతపడిపోయాయి. దీంతో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాలని చూశాయి. ఇలాంటి సమయంలో జూలై 30 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అప్పుడు రెండు సినిమాలు విడుదలవగా.. వాటికి రెస్పాన్స్ వచ్చినా కలెక్షన్లు అంతగా రాలేదు. దీంతో దర్శక నిర్మాతలు మూవీల రిలీజ్‌కు భయపడుతున్నారు.

  ఈ నేపథ్యంలో గత శుక్రవారం 'ఎస్‌ఆర్ కల్యాణమండపం' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి మాత్రం ఓ రేంజ్‌లో వసూళ్లు వస్తున్నాయి. ఫలితంగా బాక్సాఫీస్‌కు ఊపరిపోసినట్లు అయింది. ఇక, ఈ మూవీ మూడు రోజుల కలెక్షన్ల రిపోర్టును చూద్దాం పదండి!

  తండ్రి సెంటిమెంట్‌తో ‘కల్యాణమండపం'

  తండ్రి సెంటిమెంట్‌తో ‘కల్యాణమండపం'

  మొదటి చిత్రం ‘రాజావరు రాణీవారు'తో ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన హీరో కిరణ్ అబ్బవరం. అతడు నటించిన తాజా చిత్రం ‘ఎస్ఆర్ కల్యాణమండపం'. శ్రీధర్ గాదె తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియాంక జావాల్కర్ హీరోయిన్‌. డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్రను పోషించారు.

  ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రమోద్, రాజు ఈ సినిమాను నిర్మించారు. దీనికి హీరో కిరణ్ అబ్బవరం కథ, స్క్రీన్‌ప్లే, మాటలను అందించాడు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. తండ్రి సెంటిమెంట్‌తో ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది ఆగస్టు 6న విడుదలైంది.

  హీరోయిన్ ఆండ్రియా అదిరిపోయే ఫొటోలు: షర్ట్ బటన్స్ తీసేసి మరీ బోల్డు ఫోజులు!

  చిన్న సినిమాకు భారీ స్థాయిలో డీల్స్

  చిన్న సినిమాకు భారీ స్థాయిలో డీల్స్

  పేరున్న హీరో కాకపోయినా ‘ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీపై ఆది నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా ఇందులోని పాటలు సినిమాను యూత్‌కు చేరువ చేశాయి. అలాగే, టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఈ మూవీ అన్ని ఏరియాల రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.55 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.80 కోట్లుగా ఫిక్సైంది. ఎన్నో అంచనాల నడుమ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. క్రమంగా థియేటర్ల సంఖ్యను కూడా పెంచుకుంది.

  టాక్ అలా.. అది చూడకుండా రెస్పాన్స్

  టాక్ అలా.. అది చూడకుండా రెస్పాన్స్

  థియేటర్లు పున: ప్రారంభం అయిన తర్వాత పెద్ద చిత్రంగా వచ్చిందే ‘ఎస్ఆర్ కల్యాణమండపం'. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విడుదలైన దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ప్రీమియర్ షోల సమయంలోనే ఇది బాగుందని చాలా మంది చెప్పారు. ఆ తర్వాత క్రమంగా దీని టాక్ మారింది. మరీ ముఖ్యంగా ల్యాగ్ ఎక్కువగా ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఎమోషనల్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయని మరికొందరు చెప్పారు. దీంతో ఈ సినిమాకు మొత్తంగా మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, టాక్‌తో సంబంధం లేకుండా సినిమాకు రెస్పాన్స్ వస్తోంది.

  ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన యాంకర్ మంజూష: అదిరిపోయే ఫోజులతో ఘాటు ఘాటు ఫోజులు

  మూడో రోజు ఎక్కడ? ఎంత రాబట్టింది?

  మూడో రోజు ఎక్కడ? ఎంత రాబట్టింది?

  మూడో రోజైన ఆదివారం ‘ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 56 లక్షలు, సీడెడ్‌లో రూ. 30 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 17 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6.10 లక్షలు, గుంటూరులో రూ. 12.20 లక్షలు, కృష్ణాలో రూ. 6.20 లక్షలు, నెల్లూరులో రూ. 3.20 లక్షలు వసూలయ్యాయి. దీంతో మొత్తంగా మూడో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ. 1.40 కోట్లు షేర్‌తో పాటు రూ. 2.28 కోట్లు గ్రాస్‌ను రాబట్టిందీ చిత్రం. తద్వారా బాక్సాఫీస్‌పై స్టామినాను చూపించింది.

  మూడ్రోజులకు ఎక్కడ? ఎంత వచ్చింది?

  మూడ్రోజులకు ఎక్కడ? ఎంత వచ్చింది?

  ఆరంభం నుంచే మంచి స్పందనను అందుకుంటోన్న ‘ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీకి అన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి. మూడు రోజులకు కలిపి నైజాంలో రూ. 1.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 83 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 45 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 25 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 36 లక్షలు, కృష్ణాలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలు వసూలయ్యాయి. దీంతో మొత్తంగా మూడో రోజులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ. 4.06 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.64 కోట్లు గ్రాస్‌ ఈ మూవీ సొంతం అయింది.

  HBDMaheshBabu: మహేశ్ వల్లే బతికిన ఆ వేయి మంది.. సూపర్ స్టార్ గురించి తెలియని నిజాలివే!

  మిగిలిన ప్రాంతాల్లో ఇలా... మొత్తంగా!

  మిగిలిన ప్రాంతాల్లో ఇలా... మొత్తంగా!

  కోవిడ్ పరిస్థితుల కారణంగా థియేటర్ల కొరత ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ సత్తా చాటుతోంది. ఫలితంగా బాక్సాఫీస్‌లో ఓ రేంజ్‌లో దండయాత్ర చేస్తోంది. తద్వారా మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకుల ఎంతలా ఆదరిస్తారో అన్నది నిరూపించుకుంది. మూడు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.06 కోట్లు షేర్‌‌ను రాబట్టిన ఈ చిత్రం కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 14 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 17 లక్షలు వసూలు చేసింది. దీంతో మొత్తంగా మూడు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.37 కోట్లు షేర్‌తో పాటు రూ. 7.28 కోట్లు గ్రాస్‌ వచ్చింది.

  Kiran Abbavaram Birthday Special Interview | SR Kalyanamandapam | Sammathame
  బ్రేక్ ఈవెన్ టార్గెట్.. మూడు రోజుల్లోనే

  బ్రేక్ ఈవెన్ టార్గెట్.. మూడు రోజుల్లోనే

  ‘ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ ప్రీ రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ ఏరియాల్లో కలుపుకుని బిజినెస్ రూ. 4.55 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.80 కోట్లుగా ఫిక్సైంది. ఇక, మూడు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా రూ. 4.37 కోట్లు షేర్ రాబట్టింది. దీంతో టార్గెట్‌కు చేరువ అయిపోయింది. మరో రూ. 43 లక్షలు వసూలు చేస్తే ఈ చిత్రం హిట్ అయినట్లు. ఇదిలా ఉండగా.. క్లిష్ట సమయంలోనూ మూడు రోజుల్లోనే ఈ రేంజ్‌లో కోట్లు సంపాదించిన ‘ఎస్ఆర్ కల్యాణమండపం' బాక్సాఫీస్ రిపోర్టు చూసి విశ్లేషకులే షాక్ అవుతున్నారు.

  English summary
  Kiran Abbavaram Now Did a Film SR Kalyanamandapam Under Sridhar Gade Direction. This Movie Collected Rs 4.37CR Share in Three Days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X