Kishkindhapuri Closing Collections: కిష్కిందపురి క్లోజింగ్ కలెక్షన్లు.. బెల్లంకొండ మూవీ బడ్జెట్ ఎంత? వచ్చిందెం
టాలీవుడ్ స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం కిష్కిందపురి. హార్రర్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి చావు కబురు చల్లగా మూవీ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ షైన్ స్క్రీన్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంది. సెప్టెంబర్ 12న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు భారీగా తగ్గిపోయాయి. ఈ క్రమంలో సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? క్లోజింగ్ కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
కిష్కిందపురి బడ్జెట్? బ్రేక్ ఈవెన్ టార్గెట్?
ఈ చిత్రంలో నటీనటులుగా సాయి శ్రీనివాస్, అనుపమాతో పాటు ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. దరహాస్ పాలకొల్లు కథను, కే బాల గణేష్ స్క్రీన్ ప్లేను అందించారు. టెక్నికల్ టీమ్ గా చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫిని అందించగా, చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఇలా నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రచార ఖర్చులన్నీ కలుపుకొని సినిమాకు రూ.12 కోట్లు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.25 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంటుందని బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ట్రేడ్ పండితులు నిర్ణయించారు.

కిష్కిందపురి 11 రోజుల కలెక్షన్లు..
సెప్టెంబర్ 22 వరకు కిష్కిందపురి చిత్రం విడదలై 11 రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఓపెనింగ్ డే రూ.2.15 కోట్ల ఇండియా నెట్, 2వ రోజు రూ.2.50 కోట్లు, 3వ రోజు రూ.2.90 కోట్లు, 4వ రోజు రూ.1.65 కోట్ల, 5వ రోజు రూ.1.45 కోట్లు కోటి, 6వ రోజు రూ.1.05 కోట్లు, 7వ రోజు రూ.85 లక్షలు, 8వ రోజు రూ.70 లక్షలు, 9వ రోజు రూ.1.20 కోట్లు, 10వ రోజు రూ.1.15 కోట్ల ఇండియా నెట్ ను వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి.
స్టేట్ వైజ్ కలెషన్స్?
స్టేట్ వైజ్ వసూళ్ల వివరాల్లోకి వస్తే.. ఏపీ+తెలంగాణ కలిపి రూ.17.80 కోట్లు, కర్ణాటకలో రూ.1.45 లక్షలు, తమిళనాడులో రూ.17 లక్షలు, కేరళలో రూ.3 లక్షలు, ROIలో రూ.15 లక్షలు గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిక్ బాక్సాఫీస్ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
క్లోజింగ్ కలెక్షన్లు..
ప్రస్తుతం కిష్కిందపురికి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. దీంతో కిష్కిందపురి క్లోజింగ్ కలెక్షన్ వివరాల్లోకి వెళితే. కిష్కిందపురి ఇండియా నెట్ రూ.16 కోట్లు వసూల్ చేసిందని, ఇండియా గ్రాస్ రూ.18.50 కోట్లు, ఓవర్సీస్ నుంచి రూ.3.50 కోట్ల గ్రాస్ వసూలైందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో సినిమాకు ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా రూ.22 కోట్ల గ్రాస్ వసూలైంది.
లాభమా? నష్టమా?
కిష్కిందపురి చిత్రం 2వ వారం పూర్తి చేసుకొని, 3వ వారంలోనూ స్వల్పంగా కలెక్షన్లను రాబట్టేలా ఉందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఫైనల్ కలెక్షన్స్ ఎలా ఉన్నా.. ప్రస్తుతానికి మాత్రం ఇంకా 3 కోట్ల గ్రాస్ వసూలైతే ఈ చిత్రం సేఫ్ జోన్ లోకి రానుంది. ఆ తర్వాత వచ్చే కలెక్షన్లు ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లనుంది. మొత్తానికి థియేట్రికల్ రన్ ప్రకారం ఇప్పుడైతే నష్టాల్లోనే కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











