kishkindhapuri Day 1 Box Office: కిష్కిందపురి డే1 కలెక్షన్లు.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ కిష్కిందపురి. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ షైన్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత సాహు గారపాటి ఈ హారర్ర్ థ్రిల్లర్ ను నిర్మించారు. చావు కబురు చల్లగా మూవీ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. పీరియాడిక్, యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు వసూల్ చేసిందంటే?
కిష్కిందపురి బడ్జెట్ ఎంత?
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కావడం, ఈ సినిమాకు దరహాస్ పాలకొల్లు, కే బాల గణేష్ స్క్రీన్ ప్లే అందించడం, చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫి, నిరంజన్ దేవరమనే ఎడిటర్‌గా, మనీషా దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఇలా సినిమాకు నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులన్నీ కలుపుకొని చిత్రానికి రూ.12 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

కిష్కిందపురి మూవీ బ్రేక్ ఈవెన్?
కిష్కిందపురి మూవీ ప్రచార కార్యక్రమాలతో మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా సినిమాకు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అందుతోంది. అయితే ఈ చిత్రం థియేట్రికల్ రన్ ద్వారా రూ.25 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేస్తుందని, ఆపై వచ్చే కలెక్షన్లు లాభాలను చూపిస్తాయని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
కిష్కిందపురి ఓపెనింగ్ డే వసూళ్లు..
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ కు తొలిరోజు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కడం విశేషం. ఈ సందర్భంగా సినిమా ఓపెనింగ్ డే ఎన్ని కోట్ల వసూల్ అందిందనేది ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 12 శుక్రవారం రోజున ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ ద్వారా మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా కథ, విజువల్స్, సౌండ్, నటీనటుల పెర్ఫామెన్స్ బాగుందని టాక్ రావడం విశేషం.
ప్రేక్షకుల రెస్పాన్స్ తో పాటు థియేటర్లలో ఫుట్ పాల్ కూడా సినిమాకు ఓ మాదిరిగానే నమోదైంది. మార్నింగ్ షోకు 28 శాతం, ఆఫ్టర్ నూన్ షోకు 30 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. ఇక మిగిలిన షోలకు కూడా ఇదే స్థాయిలో థియేటలర్ ఆక్యుపెన్సీ నమోదు కానుందని తెలుస్తోంది. కాగా సాయంత్రం 5 గంటల వరకు కిష్కిందపురి చిత్రానికి 53 లక్షల రూపాయల ఇండియా నెట్ వసూల్ అయ్యిందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక మిగితా షోలు కలుపుకొని ఈ చిత్రానికి రూ.1.50 కోట్ల ఇండియా నెట్, రూ.3 కోట్ల గ్రాస్ వసూల్ కానుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











