kishkindhapuri Day 2 Collections: కిష్కిందపురి జోరు.. 2వ రోజు బెల్లంకొండ దూకుడు.. ఎన్ని కోట్లు వసూలైందంటే?
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ కిష్కిందపురి. హార్రర్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గా వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ కంపెనీ షైన్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత సాహు గారపాటి నిర్మించడం విశేషం. చావు కబురు చల్లగా మూవీ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి ఈ హార్రర్ ఫిల్మ్ ను డైరెక్ట్ చేశారు. ఈ క్రమంలో సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 2వ రోజు ఎన్ని కోట్లు వసూల్ చేసిందనే వివరాల్లోకి వెళితే..
కిష్కిందపురి బడ్జెట్ ఎంత?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ తో పాటు ప్రముఖ నటులు నటించడం, దరహాస్ పాలకొల్లు, కే బాల గణేష్ స్క్రీన్ ప్లే అందించడం, టాప్ టెక్నీషియన్లు చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫి, నిరంజన్ దేవరమనే ఎడిటర్‌గా, మనీషా దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, చైతన్ భరద్వాజ్ మంచి సంగతాన్ని అందించారు. దీంతో నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులు, ప్రమోషన్ ఖర్చులన్నీ కలుపుకొని సినిమాకు రూ.12 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ పండితులు వెల్లడిస్తున్నారు.

కిష్కిందపురి మూవీ బ్రేక్ ఈవెన్?
ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల ద్వారా మంచి బజ్ నే క్రియేట్ చేసింది. ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చి కూడా సినిమా నుంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం థియేట్రికల్ రన్ ద్వారా రూ.25 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.
కిష్కిందపురి 2వ రోజు వసూళ్లు..
ఈ హారర్ థ్రిల్లర్ కు తొలిరోజు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ సమీక్షలు అందాయి. టాక్ పాజిటివ్ గా ఉండటంతో సినిమా ఓపెనింగ్ డే ఓ మాదిరిగానే వసూళ్లు అందుకుంది. సినిమా కథ, విజువల్స్, సౌండ్, నటీనటుల పెర్ఫామెన్స్ బాగుండటంతో లాంగ్ రన్ లో బాక్సాఫీస్ రెస్పాన్స్ బాగుంటుందని ఆశిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 12న శుక్రవారం ఈ చిత్రానికి రూ.2 కోట్ల ఇండియా నెట్ వసూలైంది. ఇక 2వ రోజు సెప్టెంబర్ 13న శనివారం సాయంత్రం 4 గంటల వరకే రూ.1.20 కోట్ల వరకు ఇండియా నెట్ ను వసూల్ చేసినట్టు సాక్ నిక్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఇచ్చింది.
ఇక ఫస్ట్ షో+ నైట్ షోలకు వచ్చే వసూళ్లను కలుపుకొని మొత్తంగా రూ.4 కోట్ల వరకు ఇండియా నెట్, రూ.6 కోట్ల వరకు ఇండియా గ్రాస్ వసూల్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్నింగ్ షోకు థియేటర్ ఆక్యుపెన్సీ 33 శాతం, ఆఫ్టర్ నూన్ షోకు 53 శాతం నమోదు కావడం విశేషం. దీంతో 2వ రోజు భారీగానే వసూళ్లు ఉంటాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. దీంతో 2 రోజుల్లో ఇండియా గ్రాస్ రూ.10 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











