Kishkindhapuri Day 3 Collections: దుమ్మురేపిన బెల్లంకొండ.. కిష్కిందపురి 3వ రోజు కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?

తెలుగు స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా నటించిన చిత్రం కిష్కిందపురి. ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ నటించడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రాక్షకుడు అనే చిత్రం వచ్చింది. ఇక తాజాగా హార్రర్ థ్రిల్లర్ ఫిల్మ్ కిష్కిందపురితో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి టాప్ ప్రొడక్షన్ కంపెనీ షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరించారు. చావు కబురు చల్లగా మూవీ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఈక్రమంలో మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 3వ రోజు వసూళ్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..

కిష్కిందపురి బడ్జెట్ ఎంత?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ హీరోయిన్లుగా, దరహాస్ పాలకొల్లు, కే బాల గణేష్ స్క్రీన్ ప్లే, చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫి, నిరంజన్ దేవరమనే ఎడిటర్‌గా, మనీషా దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇలా నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రచార వ్యయం అంతా కలుపుకొని సినిమాకు రూ.12 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

kishkindhapuri Day 3 Expected Box Office Collection Worldwide

కిష్కిందపురి మూవీ బ్రేక్ ఈవెన్?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ ఫిల్మ్ కిష్కిందపురికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో సులభంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం లభాల్లోకి రావాలంటే రూ.25 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

కిష్కిందపురి 2 రోజుల కలెక్షన్లు..
సినిమా కథ, విజువల్స్, సౌండ్, నటీనటుల పెర్ఫామెన్స్ బాగుండటంతో కిష్కిందపురి చిత్రానికి డే బై డే వసూళ్లు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 12న విడుదలైన కిష్కిందపురి చిత్రం ఓపెనింగ్ డే రూ.2.30 కోట్ల ఇండియా నెట్‌ను వసూల్ చేసింది. 2వ రోజు రూ.2.70 కోట్లు ఇండియా నెట్ వసూల్ చేసింది. దీంతో 2 రోజుల్లో రూ.5 కోట్ల ఇండియా నెట్, రూ.8 కోట్ల వరకు ఇండియా గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

3వ రోజు మరింత జోరుగా..
కిష్కిందపురి చిత్రానికి 3వ రోజు సెప్టెంబర్ 14న ఆదివారం మరింత జోరుగా వసూళ్లు దక్కుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల వరకే ఈ చిత్రం రూ.1.10 కోట్లు ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ తెలుపుతోంది. కేవలం మార్నింగ్ షోలతోనే ఇంత కలెక్ట్ అయ్యిందని తెలిపారు. ఇక ఆఫ్టర్ నూన్ షోస్ + ఈవెనింగ్ షోస్ + నైట్ షోస్ కలుపుకొని రూ.4 కోట్ల వరకు ఇండియా నెట్, రూ.6 కోట్ల వరకు ఇండియా గ్రాస్ వసూల్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక థియేటర్ ఆక్యుపెన్సీ కూడా మార్నింగ్ షోలకు 38 శాతం నమోదు కావడం విశేషం.మిగితా షోలకు మరింత శాతం పెరగనుందని అంచనా.

వరల్డ్ వైడ్ గా..
2 రోజుల్లో కిష్కిందపురి చిత్రం ఇండియా నెట్ రూ.4.81 కోట్లకు చేరుకుంది. ఇక ఇండియా గ్రాస్ రూ.8 కోట్లు, ఓవర్సీస్ లో రూ.1 కోటి గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఇండియా + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని రూ.9 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని తెలుపుతున్నారు. ఇక 3వ రోజు వసూళ్లతో కిష్కిందపురి చిత్రం రూ.15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X