kishkindhapuri Day 4 Collections: కిష్కిందపురి 4వ రోజు కలెక్షన్లు.. ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ కిష్కిందపురి. హార్రర్ జోనర్ లో ఈ చిత్రం రూపుదిద్దుకోవడం విశేషం. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రాక్షసుడు అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కిష్కిందపురి చిత్రం సెప్టెంబర్ 12న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. కాగా సినిమా బడ్జెట్ ఎంత? ఎన్ని కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంది? 4వ రోజు ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందనే వివరాల్లోకి వెళితే..
కిష్కిందపురి చిత్రం బడ్జెట్?
కిష్కిందపురి చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ కంపెనీ షైన్ స్క్రీన్ బ్యానర్ లో నిర్మాత సాహు గారపాటి రూపొందించారు. ఈ చిత్రానికి చావు కబురు చల్లగా మూవీ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. దరహాస్ పాలకొల్లు, కే బాల గణేష్ స్క్రీన్ ప్లే, చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫి, నిరంజన్ దేవరమనే ఎడిటర్‌గా, మనీషా దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. దీంతో నటీనటులు, సినీయర్ టెక్నీషియన్లు నటించడంతో వారి రెమ్యునరేషన్లు, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులన్నీ కలుపుకొని రూ.12 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ పండింతులు వెల్లడించారు.

కిష్కిందపురి బ్రేక్ ఈవెన్ టార్గెట్?
తెలుగు ప్రేక్షకులు రోటీన్ కు భిన్నంగానే ఉండే చిత్రాలకు జై కొడుతున్న సంగతి తెలిసిందే. ఇక హార్రర్ థ్రిల్లర్ చిత్రాలకు మరింత స్పందన లభిస్తుంటుంది. ఇదే జోనర్ లో కిష్కిందపురి చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఓ మాదిరిగా ప్రీరిలీజ్ బిజినెస్ అయ్యిందని, సినిమా రూ.25 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుంటుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
కిష్కిందపురి 3 రోజుల కలెక్షన్లు..
ఓపెనింగ్ డే రూ.2.15 కోట్ల ఇండియా నెట్, 2వ రోజు రూ.2.85 కోట్లు, 3వ రోజు రూ.3.50 కోట్ల వరకు ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ రిపోర్ట్ వెల్లడించింది. దీంతో ఇండియా నెట్ రూ.8.20 కోట్లు, ఇక ఇండియా గ్రాస్ రూ.9.50 కోట్లు వసూల్ చేసింది. అలాగే ఓవర్సీస్ లో రూ.1.75 కోట్లు కలెక్షన్ అందింది. ఇలా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.11.30 కోట్ల వరకు వసూళ్లు అందుకుంది.
4వ రోజు వసూళ్లు..
ఈ సినిమా కథ, కథనం, మ్యూజిక్, నటీనటుల పెర్ఫామెన్స్ బాగుండటంతో మౌత్ పబ్లిసిటీ బాగా జరిగింది. దీంతో సినిమాకు ఫూట్ ఫాల్ పెరుగుతోంది. 4వ రోజు మార్నింగ్ షోకు 23 శాతం, మధ్యాహ్నం షోలకు 30 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైందని సాక్ నిక్ రిపోర్ట్ లో పేర్కొంది. ఇలా సాయంత్రం 4 గంటల వరకు కిష్కిందపురి రూ.50 లక్షల ఇండియా నెట్ అందుకుంది. మిగితా నైట్ షోలకు వచ్చే కలెక్షన్లు కలుపుకొని 4వ రోజు రూ.1.50 కోట్ల వరకు వసూల్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. వర్కింగ్ డే కూడా ఈ మాత్రం వసూల్ అవ్వడం విశేషమంటున్నారు.
స్టేట్ వైజ్ కలెక్షన్లు..
కిష్కిందపురి చిత్రం కర్ణాటకలో రూ.71 లక్షలు, ఏపీ + తెలంగాణలో రూ.8.63 కోట్లు నెట్, తమిళనాడులో రూ.6 లక్షలు, కేరళలో రూ.3 లక్షలు, ROIలో రూ.7 లక్షలు వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి.


Click it and Unblock the Notifications











