Kishkindhapuri Day 5 Collections: కిష్కింధపురి 5వ రోజు కలెక్షన్లు.. నెగిటివ్ టాక్‌తో బ్రేక్ ఈవెన్‌కు చేరువగా..
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్‌పై యువ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన చిత్రం కిష్కిందపురి. చావు కబురు చల్లగా చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో యువ హీరో, హీరోయిన్లు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. పీరియాడిక్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన రిలీజైంది.
టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్‌తో పాజిటివ్ రియాక్షన్ సొంతం చేసుకొన్న ఈ సినిమాకు దరహాస్ పాలకొల్లు, కే బాల గణేష్ స్క్రీన్ ప్లే అందించగా, క్రియేటివ్ విభాగంలో జీ కనిష్క, చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫి, నిరంజన్ దేవరమనే ఎడిటర్‌గా, మనీషా దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? గత 5 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..

షైన్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొంందిన ఈ సినిమాను వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ సహాయంతో రిచ్‌గా నిర్మించారు. ఈ చిత్రాన్ని క్వాలిటీ పరంగా ఎలాంటి రాజీ లేకుండా సాహు గారపాటి రూపొందించారు. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కలిపి ఈ సినిమాను 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌కు భారీగా స్పందన రావడంతో బిజినెస్ కూడా భారీగా జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ భారీగా కాకుండా మిడ్ రేంజ్‌లో అమ్మడం జరిగింది. ఆంధ్రా, నైజాం రైట్స్ మొత్తం 7.5 కోట్ల రూపాయలకు అమ్మారు. అలాగే కర్ణాటక, ఓవర్సీస్ హక్కులు 2.5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్ సుమారుగా 10 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా 12 కోట్ల రూపాయల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి స్పందన కనిపించింది. తొలి రోజు 2.15 కోట్ల రూపాయలు, రెండో రోజు 2.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 3 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 1.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం సుమారుగా 9 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 5 కోట్ల గ్రాస్ రూపాయలు వసూలు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో కిష్కింధపురి సినిమా బాక్సాఫీస్ రిపోర్టు వివరాల్లోకి వెళితే.. ఏపీ, నైజాంలో తొలి రోజు 1.35 కోట్ల రూపాయలు, రెండో రోజు 1.8 కోట్లు, మూడో రోజు 2 కోట్లు, నాలుగో రోజు 1 కోటి రూపాయలు వసూలు చేసింది. నైజాంలో 3 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 3.5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో 6.5 కోట్ల షేర్.. 11 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
ఇక ఈ సినిమా 5వ రోజు వర్కింగ్ డే కావడంతో కలెక్షన్లపై, ఆక్యుపెన్సీపై ప్రభావం పడింది. ఈ సినిమాకు 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో ఈ సినిమా 1 కోటి రూపాయల నుంచి 1.5 కోట్ల రూపాయల వరకు 5వ రోజు వసూలు చేసుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా కనీసం 1.5 కోట్లకుపైగానే రాబట్టాల్సి ఉంది. రెండో వారాంతం లోపల బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











