kishkindhapuri Day 6 Collections: బ్రేక్ ఈవెన్‌కు చేరువలో కిష్కిందపురి.. 6వ రోజు ఎన్ని కోట్ల కలెక్షనంటే?

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తెలుగు హార్రర్ ఫిల్మ్ కిష్కిందపురి చిత్రం కాస్తా మంచి వసూళ్లనే అందుకుంది. టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, స్టార్ హీరోయిన్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జంటగా ఈ చిత్రంలో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో రాక్షసుడు అనే క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ గా నిలిచింది. ఇప్పుడు కిష్కిందపురి చిత్రం అదే తరహాలో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. కాగా సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 6వ రోజు ఎన్ని కోట్లు వసూల్ చేసిందంటే..

కిష్కిందపురి చిత్రం బడ్జెట్? బ్రేక్ ఈవెన్ టార్గెట్?
సెప్టెంబర్ 12న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది కిష్కిందపురి చిత్రం. టాప్ ప్రొడక్షన్ కంపెనీ షైన్ స్క్రీన్ సంస్థ రూపొందించింది. చావు కబురు చల్లగా మూవీ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. దరహాస్ పాలకొల్లు, కే బాల గణేష్ స్క్రీన్ ప్లే, చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫి అందించారు. చేతన్ భరద్వాజ్ ఆకట్టుకునేలా సంగీత దర్శకత్వం వహించారు. ఇలా నటీనటులు, సినీయర్ టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులు, ప్రమోషన్ కార్యక్రమాలన్నీ కలుపుకొని రూ.12 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.25 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను నిర్ణయించారు.

kishkindhapuri Day 6 Expected Box Office Collection Worldwide

కిష్కిందపురి 5 రోజుల కలెక్షన్లు..
ఓపెనింగ్ డే రూ.2.15 కోట్ల ఇండియా నెట్‌, 2వ రోజు రూ.2.50 కోట్లు, 3వ రోజు రూ.2.90 కోట్లు, 4వ రోజు రూ.1.21 కోట్ల, 5వ రోజు రూ.1 కోటీ ఇండియా నెట్ వసూల్ చేసింది. ఇలా 5 రోజుల్లో ఇండియా నెట్ రూ.9.80 కోట్ల వరకు వసూలైందని సాక్ నిక్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఇచ్చింది.

6వ రోజు కలెక్షన్..
సెప్టెంబర్ 17న కిష్కిందపురి చిత్రానికి కాస్తా బాక్సాఫీస్ వసూల్ తగ్గినట్టు కనిపిస్తోంది. వీకెండ్ తో కిష్కిందపురి పెర్ఫామ్ చేసినంతగా వర్కింగ్ డేస్ లో పెద్దగా వసూల్ చేయడం లేదు. ఇక 6వ రోజు సాయంత్రం 4 గంటల వరకు రూ.50 లక్షల వరకు ఇండియా నెట్ న వసూల్ చేసిందని, ఇక మిగితా షోలను కలుపుకొని రూ.1 కోటీ ఇండియా నెట్ వసూలైనట్టు ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రాల వారీగా వసూల్..
కిష్కిందపురి చిత్రం ఏపీ+తెలంగాణ రాష్ట్రాల్లో కలిసి తెలుగులో రూ.8.08 కోట్లు నెట్, కర్ణాటకలో రూ.66 లక్షలు, తమిళనాడులో రూ.6 లక్షలు, కేరళలో రూ.3 లక్షలు, ROIలో రూ.7 లక్షలు వసూల్ చేసిందని తొలి వీకెండ్ కలెక్షన్లను సాక్ నిక్ వెల్లడించింది. ఇప్పటి ఇండియా గ్రాస్ రూ.15 కోట్లు, ఓవర్సీస్ లో రూ.2 కోట్లు వసూల్ చేసిందని, ఇలా వరల్డ్ వైడ్ గా రూ.17 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. దీంతో 2వ వీకెండ్ పూర్తయ్యే లోపు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X