Kishkindhapuri Day 7 Box Office: కిష్కిందపురి వారం రోజుల కలెక్షన్లు.. బెల్లంకొండ మూవీకి ఎన్ని కోట్లంటే?

టాలీవుడ్ స్టార్ బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కిష్కిందపురి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ నటించడం విశేషం. వీరి కాంబోలో గతంలో రాక్షసుడు అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ గా నిలిచింది. ఇప్పుడు హార్రర్ థ్రిల్లర్ ఫిల్మ్ గా కిష్కిందపురి చిత్రం విడుదలై అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద మొదటి వారం పూర్తి చేకుంది. మంచి వసూళ్లనే అందుకుంటోంది. కాగా ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 7వ రోజు కలెక్షన్ ఎంతనే వివరాల్లోకి వెళితే..

కిష్కిందపురి బడ్జెట్? బ్రేక్ ఈవెన్ టార్గెట్?
కిష్కిందపురి చిత్రం సెప్టెంబర్ 12న విడుదలైంది. కాగా ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్, అనుపమా నటించడం, చావు కబురు చల్లగా మూవీ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్, దరహాస్ పాలకొల్లు, కే బాల గణేష్ స్క్రీన్ ప్లే, చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫి అందించారు. సీనియర్ టెక్నీషియన్లు, నటీనటుల రెమ్యునరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులన్నీ కలుపుకొని చిత్రానికి రూ.12 కోట్లు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. టాప్ ప్రొడక్షన్ కంపెనీ షైన్ స్క్రీన్ బ్యానర్ పై రూపుదిద్దుకుంది. చేతన్ భరద్వాజ్ సంగీత దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం రూ.25 కోట్ల గ్రాస్ వసూల్ చేస్తే లాభాల్లోకి రానుంది.

kishkindhapuri Day 7 Expected Box Office Collection Worldwide

కిష్కిందపురి 7 రోజుల కలెక్షన్లు..
ఓపెనింగ్ డే రూ.2.15 కోట్ల ఇండియా నెట్‌, 2వ రోజు రూ.2.50 కోట్లు, 3వ రోజు రూ.2.90 కోట్లు, 4వ రోజు రూ.1.65 కోట్ల, 5వ రోజు రూ.1.45 కోట్లు కోటి, 6వ రోజు రూ.1.05 కోట్లు ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ గణంకాలు తెలుపుతున్నాయి. ఇక 7వ రూ.50 లక్షల ఇండియా నెట్ వసూలైందని, మిగితా షోలు కలుపుకొని 7వ రోజు రూ. 1 కోటి నెట్ వసూల్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వరల్డ్ వైడ్ గా కలెక్షన్లు..
6వ రోజు వరకు ఇండియా నెట్ రూ.12.10 కోట్లకు చేరుకుందని, ఇక ఇండియా గ్రాస్ రూ.14 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో రూ.2.5 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని రూ.16.5 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది.

స్టేట్ వైజ్ గా వసూళ్లు..
తెలుగు రాష్ట్రాల్లో ఏపీ+తెలంగాణ కలిపి రూ.12.68 కోట్లు నెట్, కర్ణాటకలో రూ.90 లక్షలు, తమిళనాడులో రూ.90 లక్షలు, కేరళలో రూ.3 లక్షలు, ROIలో రూ.10 లక్షలు వసూల్ చేసిందని సాక్ నిక్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా ఈ చిత్రం రూ.8 కోట్ల వరకు వసూల్ చేస్తే సేఫ్ జోన్ లోకి రానుంది. మొదటి వారం ఈ చిత్రం మంచి వసూళ్లనే అందుకుంది. ఇక 2వ వారంలో ఎలాంటి వసూళ్లను అందుకుంటుందనేది మరింత ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X