Kishkindhapuri 2nd Week Collection : 2వ వారంలో కిష్కిందపురి.. 8వ రోజు వసూళ్లు ఎంతంటే?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా నటించిన చిత్రం కిష్కిందపురి. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. హార్రర్ థ్రిల్లర్ చిత్రాన్ని చావు కబురు చల్లగా మూవీ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేశారు. టాప్ ప్రొడక్షన్ కంపెనీ షైన్ స్క్రీన్ బ్యానర్ పై రూపుదిద్దుకుంది. సెప్టెంబర్ 12 ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చింది. ఇక బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోందీ చిత్రం. ప్రస్తుతం 2వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్బంగా సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 8వ రోజు వసూళ్లు ఎంతనే వివరాల్లోకి వెళితే..
కిష్కిందపురి బడ్జెట్? బ్రేక్ ఈవెన్ టార్గెట్?
సాయి శ్రీనివాస్, అనుపమా జంటగా నటించడం, దరహాస్ పాలకొల్లు కథను, కే బాల గణేష్ స్క్రీన్ ప్లే, చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫిని అందించగా, సీనియర్ టెక్నీషియన్లు పనిచేశారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఇక నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్ ఖర్చులన్నీ కలుపుకొని సినిమాకు రూ.12 కోట్లు బడ్జెట్ అయ్యిందని, ఇక లాభాల్లోకి రావాలంటే రూ.25 కోట్ల గ్రాస్ వసూల్ చేయాలని బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ట్రేడ్ పండింతులు నిర్ణయించారు.

కిష్కిందపురి 8 రోజుల కలెక్షన్లు..
మొదటి రోజు రూ.2.15 కోట్ల ఇండియా నెట్, 2వ రోజు రూ.2.50 కోట్లు, 3వ రోజు రూ.2.90 కోట్లు, 4వ రోజు రూ.1.65 కోట్ల, 5వ రోజు రూ.1.45 కోట్లు కోటి, 6వ రోజు రూ.1.05 కోట్లు, 7వ రోజు రూ.85 లక్షల ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. దీంతో వారం రోజుల్లో కిష్కిందపురి ఇండియా నెట్ రూ.12.45 కోట్లకు చేరుకుంది.
ఇక సెప్టెంబర్ 19తో కిష్కిందపురి చిత్రం బాక్సాఫీస్ వద్ద 8వ రోజుకు చేరుకుంది. అంటే 2వ వారంలోకి అడుగు పెట్టింది. ఇక 8వ రోజు వర్కింగ్ డే అయినా కూడా మొదటి ఆటకే రూ.26 లక్షలు కలెక్ట్ చేసిందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది. ఆఫ్టర్ నూన్, ఫస్ట్ షో, నైట్ షోలు కలుపుకొని రూ.1 కోటి వరకు ఇండియా నెట్ వసూల్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్టేట్ వైజ్ కలెషన్స్, వరల్డ్ వైడ్ కలెక్షన్స్?
7వ రోజు వరకు ఇండియా నెట్ రూ.12.45 కోట్లకు, ఇక ఇండియా గ్రాస్ రూ.14.65 కోట్లు, ఓవర్సీస్ లో రూ.2.6 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా రూ.17.25 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి... ఇక స్టేట్ వైజ్ వసూళ్ల వివరాల్లోకి వస్తే.. ఏపీ+తెలంగాణ కలిపి రూ.13.61 కోట్లు, కర్ణాటకలో రూ.95 లక్షలు, తమిళనాడులో రూ.10 లక్షలు, కేరళలో రూ.3 లక్షలు, ROIలో రూ.11 లక్షలు వసూల్ చేసిందని సాక్ నిక్ బాక్సాఫీస్ రిపోర్ట్ తెలుపుతోంది.


Click it and Unblock the Notifications











