»   » 'శంకరాభరణం' వాయిదా.. 'అఖిల్‌' కోసమే: కోన వెంకట్

'శంకరాభరణం' వాయిదా.. 'అఖిల్‌' కోసమే: కోన వెంకట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అక్కినేని వారసుడిగా తెరంగేట్రం చేస్తున్న అఖిల్‌ చిత్రం కోసం తమ సినిమా విడుదలని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్‌ తెలిపారు.

ఆయన నిర్మాణ సారథ్యంలో నిఖిల్‌, నందిత, అంజలి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన 'శంకరాభరణం' చిత్రాన్ని డిసెంబర్‌ 4కి వాయిదా వేస్తున్నట్లు కోన వెంకట్‌ ఫేస్‌బుక్‌, ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.అఖిల్‌కి ఘన స్వాగతం పలికేందుకే తమ చిత్రాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తొలుత ఈ చిత్రాన్ని నవంబర్‌ 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నవంబర్‌ 11న అఖిల్‌ అక్కినేని తెరంగేట్రం చేస్తున్న 'అఖిల్‌' చిత్రం విడుదల అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


Kona Venkat Postponed Sankarabharanam for Akhil

అలనాటి 'శంకరాభరణా'నికి ఎక్కడా పోలిక లేకుండా సరికొత్త కథాంశంతో తెరకెక్కిన సరికొత్త 'శంకరాభరణం' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా కొత్త ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ ఫన్నీగా ఉంటూ.. ..ఇంట్రస్టింగ్ గా సాగింది. మీరూ ఆ ట్రైలర్ ని చూడండి.

ఈ చిత్రంలో నిఖిల్‌, నందిత, అంజలిలు ప్రధాన పాత్రల్లో నటించారు. కోన వెంకట్‌ నిర్మాణా సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ఉదయ్‌ నందనవనం దర్శకుడిగా పరిచయం అయ్యారు.


వినూత్నమైన కథతో బిహార్‌ నేపథ్యంలోని గ్యాంగ్స్‌, కిడ్నాపింగ్‌ తదితర అంశాలతో హాస్యాన్ని మేళవించి తెరక్కించారు. ఈ చిత్రంలో చాలా మంది హాస్యనటులు ఉండడం బాగా కలిసి వచ్చే అంశమని పలువురు ప్రశంసించారు. ఈ చిత్రానికి ప్రవీణ్‌ లక్కరాజు స్వరాలు అందించారు.


రెగ్యులర్,రొటీన్ కమర్షియల్ సినిమా ఫార్మెట్ లో పెద్ద హీరోల తరహాలో ప్రయత్నాలు చేసి బోల్తా పడ్డ నిఖిల్ ..రూట్ మార్చి సక్సెస్ లు ఇవ్వటం మొదలెట్టాడు. స్వామిరారా చిత్రంతో అతని జర్నీ మారిపోయింది. వరస హిట్స్ తో మినిమం గ్యారెంటీ హీరోగా దూసుకుపోతున్నాడు. దాంతో అతని చిత్రం అంటే బిజినెస్ బాగా జరుగుతోంది.


తాజాగా శంకరాభరణం కు కూడా అదే సిట్యువేషన్. స్కై హై ఫిల్మ్స్ వారు నా శంకరాభరణం చిత్రం ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు.English summary
kona venkat ‏ tweeted: "We have decided to release our SHANKARABHARANAM on Dec 4th to give a grand welcome and uninterrupted run to AKHIL !!!"
Please Wait while comments are loading...