»   »  'క్షణం' శాటిలైట్ రేటు, సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువే

'క్షణం' శాటిలైట్ రేటు, సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :క్షణం సేపు కూడా ఉత్కంఠ తగ్గించకుండా తీసిన సినిమా 'క్షణం'. సుపర్ హిట్ టాక్ దుసుకుపోతున్న ఈ సినిమా టీంకు మరో ఆనందాన్ని అందిస్తూ శాటిలైట్ హక్కులు ఎవరూ ఊహించలేనంతగా రేటుకు అమ్ముడుపోయింది.

అడవి శేషు హీరోగా, ఆదా శర్మ హీరోయిన్ గా, అనసూయా ప్రత్యక పాత్రలో నటించిన సినిమా క్షణం. ఇప్పటికే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. సుమారు 1.75 కోట్ల రూపాయలతో ఓ ప్రముఖ టీవి చానల్ శాటిలైట్ హక్కులు కొనుక్కున్నట్టు తెలుస్తోంది. సినిమానే కోటి రూపాయలలో తీసినట్లు దర్శక,నిర్మతలు మరో ప్రక్క చెప్తున్న నేపధ్యంలోఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.


మరో ప్రక్క ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ సినిమాను, ఇంగ్లీస్ సబ్ టైటిల్స్ తో దేశవ్యప్తంగా విడుదల చెయ్యలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల తరఫున మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.


Kshanam satellite rights sold for double the budget

అయితే ఈ చిత్రాన్ని శుక్రవారం సబ్‌టైటిల్స్‌తో ముంబయి, పూనె, గోవా, దిల్లీలో ప్రదర్శించనున్నట్లు బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు.


చాలా తక్కువ బడ్జెట్ లో తీసిన ఈసినిమా ఊహించని లాభాలను ఆర్జిస్తోంది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు, వారి క్యారక్టర్స్ కి ప్రాణం పోసారు. దీనికి కథని అడవి శేషు అందించగా, రవికాంత్ పెరుపు డారక్షన్ వహించారు. పి.వి.పి. వారికి మెదటి ప్రోఫిటబుల్ సినిమా ఇది. ప్రస్తుతం ఊపిరి, బ్రహ్మోత్సవం సినిమాలతో బిజిగా వుంది పి.వి.పి.సంస్థ.


రవికాంత్‌ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా పతాకంపై తెరకెక్కించారు. అనసూయ భరద్వాజ్‌, వెన్నెల కిషోర్‌, సత్యం రాజేష్‌ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

English summary
A popular TV channel bagged the satellite rights of the film for Rs.1.75 Crore which is a sensational amount for a small film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu