»   » లెజెండ్ 4 డేస్ కలెక్షన్: బాలయ్య దెబ్బకు మహేష్ బాబు వెనక్కి!

లెజెండ్ 4 డేస్ కలెక్షన్: బాలయ్య దెబ్బకు మహేష్ బాబు వెనక్కి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'లెజెండ్' చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. వీకెండ్‌తో పాటు, సోమవారం ఉగాది సెలవు దినం కలిసి రావడంతో కలెక్షన్ల పంట పండిస్తోంది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన మహేష్ బాబు '1' సినిమా కలెక్షన్ల కంటే 'లెజెండ్' చిత్రం కలెక్షన్లు బెటర్‌గా ఉండటం గమనార్హం.

మార్చి 28వ తేదీన లెజెండ్ చిత్రాన్ని 1000కి పైగా థియేటర్లలో విడుదల చేసారు. తొలి రోజు సినిమాకు హిట్ టాక్ రావడంతో పాజిటివ్ మౌత్ టాక్ వ్యాపించింది. దీంతో తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే శనివారం కాస్త కలెక్షన్లు తగ్గాయి. కానీ ఆదివారం మునిసిపల్ ఎన్నికలు ఉన్నప్పటికీ మంచి వసూళ్లు రాబట్టింది.

Legend 4 Days Collection At Box Office: Balakrishna Storm

గడిచిన నాలుగు రోజుల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ బాక్సాఫీసు వద్దనే ఈచిత్రం రూ. 19.15 కోట్లు వసూలు చేసింది. విడుదల రోజైన శుక్రవారం రూ. 6.90 కోట్లు, శనివారం రూ. 3.75 కోట్లు, ఆదివారం రూ. 4.35 కోట్లు, సోమవారం 4.15 కోట్లు వసూలు చేసింది. దీంతో పాటు కర్నాటకలో రూ. 2.65 కోట్లు వసూలు చేయడం విశేషం.

అమెరికాలో ఈ చిత్రాన్ని మార్చి 27వ తేదీన 60కిపైగా స్క్రీన్లలో విడుదలయింది. అక్కడ కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. తొలి నాలుగు రోజులు ఈ చిత్రం ఏకంగా రూ. 2.15 కోట్లు ($357,829) వసూలు చేసింది. బాలయ్య కెరీర్లోనే ఇదొక రికార్డు. టోటల్‌గా ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా Rs 23.85 కోట్లు వసూలు చేసింది.

English summary
Director Boyapati Srinu's action-drama Legend has received an earth-shattering response at the worldwide Box Office over the weekend. Clearing the Monday test, the Nandamuri Balakrishna starrer has continued to rock the viewers even on the weekdays. Its collection is much better than that of Superstar Mahesh Babu's 1: Nenokkadine, which was released during Sankranti festival early this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu