»   » షాకింగ్ : ‘లెజెండ్' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అంతా?

షాకింగ్ : ‘లెజెండ్' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అంతా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటించిన 'లెజెండ్' చిత్రం ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మరో వైపు బాలయ్య 'లెజెండ్ సింహ యాత్ర' పేరుతో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ సినిమాకు మరింత హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం తొలివారం పూర్తయ్యే సరికి భారీగా కలెక్షన్లు రాబట్టింది.

తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి వారం రూ. 33.58 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం త్వరలోనే రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే నిర్మాతల నుండి కలెక్షన్లుకు సంబంధించిన వివరాలపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. దీంతో ఈ కలెక్షన్ల వివరాలు నిజమేనా? కాదా? అనేది విషయమై సందిగ్ధత నెలకొంది.

Legend first week collections

ట్రేడ్ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం తొలి వారం కలెక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి....

నైజాం- రూ. 6.53 కోట్లు
సీడెడ్- రూ. 6.49 కోట్లు
వైజాగ్- రూ. 2.73 కోట్లు
గుంటూరు- రూ. 3.66 కోట్లు
ఈస్ట్ గోదావరి - రూ. 1.49 కోట్లు
వెస్ట్ గోదావరి- రూ. 1.36 కోట్లు
నెల్లూరు- రూ. 1.23 కోట్లు
కృష్ణా - రూ. 1.64 కోట్లు
కర్ణాటక- రూ. 2.65 కోట్లు
ఓవర్సీస్- రూ. 5.02 కోట్లు
రెస్టాఫ్ ఇండియా - రూ. 1.08 కోట్లే
టోటల్ ఫస్ట్ వీక్ కలెక్షన్ : రూ. 33.58 కోట్లు

English summary

 Balakrishna's action entertainer Legend is making its way to become a huge blockbuster. The movie first week collections stand at 33.58 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu