twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ పై నమ్మకంతో 'లెజండ్' ప్రొడ్యూసర్ పెట్టుబడి

    By Srikanya
    |

    హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'లింగ'. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్స్ . ఈ చిత్రం తెలుగు విడుదల హక్కులను సైతం ఏరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా లిమిటెడ్‌ దక్కించుకుంది. బిజినెస్ ప్రారంభమైంది. అందుతున్న సమాచారం ప్రకారం సీడెడ్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు లెజండ్ నిర్మాత సాయి కొర్రపాటి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

    ఆరు కోట్ల ముప్ఫై లక్షలకు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. రజనీ చిత్రాల్లో ఇది హైయిస్ట్ రేటు అని చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ఈ మొత్తాన్ని వెచ్చించినట్లు చెప్పుకుంటున్నారు. మొత్తం 160 కోట్లుకు ఈరోస్ వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 28న సెన్సార్ అవుతుంది. వచ్చే నెల 12 న రిలీజ్ అవుతుంది.

    శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏ.ఆర్‌.రహమాన్‌ స్వరాలందించారు. 'లింగ సినిమా విడుదల హక్కులను దక్కించుకున్నాం. తమిళ, తెలుగు, హిందీ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం' అని ఏరోస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఈనెలలో గీతాలను విడుదల చేసి, వచ్చే నెలలో రజనీకాంత్‌ జన్మదినం సందర్భంగా సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది.

    Legend Producer buys Rajinikanth Lingaa

    సినిమా గురించి రజనీకాంత్‌ మాట్లాడుతూ....., అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు ముందులాగా మళ్లీ నటించగలనా, డ్యాన్స్‌లు చేయగలనా అన్న సందేహం కలిగిందన్నారు. ‘కోచ్చడయాన్‌' చేసినప్పటికీ ఒక్క సీనులో అయినా మీరు కనిపిస్తారేమోనని చూశాం సార్‌ అని అభిమానులు బాధపడ్డారని విన్నప్పుడు వెంటనే సినిమా చేయాలనిపించిందన్నారు. అయితే ఏళ్ల తరబడి కాకుండా ఆరు నెలల్లో తీయాలని దర్శకుడికి షరతు పెట్టి మరీ ‘లింగా'లో నటించానన్నారు.

    గొప్ప టెక్నీషియన్లు, అగ్రతారలతో కూడా అతి తక్కువ సమయంలోనే భారతీయతనం ఎక్కడా తగ్గకుండా సినిమా తీయగలమని నిరూపించాలని ఆరు నెలల్లో ఈ సినిమా పూర్తి చేశామని, ఈ సత్తా ఉన్న ఏకైక దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ మాత్రమేనని రజనీకాంత్‌ కొనియాడారు.

    అనుష్క మాట్లాడుతూ, రజనీకాంత్‌లో నటించిన అనుభవాన్ని మాటల్లో చెప్పలేనని అంది. రజనీ సెట్‌లోకి రాగానే అందరి ముఖాల్లో నవ్వు, కళ్లల్లో మెరుపు చూసేదానన్నది, వాళ్లంతా రజనీపై చూపిన అభిమాని ఎంతో గొప్పదని పేర్కొంది.

    ఇక విలన్‌గా నటించిన జగపతిబాబు మాట్లాడుతూ, రజనీకాంత్‌ సినిమా అనగానే కథ, పారితోషకం కూడా అడగకుండా ఓకే చెప్పేశానన్నారు. ఒక పుస్తకాన్ని చూపించి ‘రజనీ ఆటోగ్రాఫ్‌ చేసిన పుస్తకమిది. నేను తీసుకున్న తొలి, ఆఖరి ఆటోగ్రాఫ్‌ ఇదే' అని చెప్పారు.

    English summary
    Distributor-cum-producer Sai Korrapati who earlier produced Eega and Legend has bought the rights Superstar Rajinikanth Lingaa by shelling out Rs 6.30 Crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X