Little Hearts 3 Days Box Office: లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ సెన్సేషన్.. హరిహర వీరమల్లును మించి.. ఎన్ని కోట్లంట
90s మిడిల్ క్లాస్ బయోపిక్‌తో టీనేజ్ స్టార్‌గా మారిన మౌళీ తనుజ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీతో పాపులారిటీ సంపాదించుకొన్న శివానీ నాగారం జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ చిత్రం లిటిల్ హార్ట్స్. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా మారి రూపొందించిన చిత్రానికి తొలి చిత్ర దర్శకుడు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద రాబడుతున్న కలెక్షన్ల వివరాలు ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
లిటిల్ హార్ట్స్ సినిమాకు సింజిత్ యెర్రమల్లి సంగీతం, సూర్య బాలాజీ సినిమాటోగ్రఫి, శ్రీధర్ సొంపలి ఎడిటర్‌గా, దివ్య పవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను సుమారుగా 2.5 కోట్ల రూపాయలతో నిర్మించారు. యంగ్ టాలెంట్ కూర్పుతో రూపొందిన ఈ సినిమా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఈటీవీ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై స్ట్రాంగ్ కంటెంట్‌తో రూపొందింది. ఈ మూవీ రిలీజ్‌కు ముందే ప్రీమియర్లను ప్రదర్శించారు. ఈ సినిమాకు బ్రహ్మండమైన రెస్సాన్ రావడంతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్‌గా డిస్ట్రిబ్యూట్ చేశారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ తనుజ్, శివానీ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రీమియర్లతో ఊపందుకొని.. తొలి ఆట నుంచి బ్రహ్మాండమైన రెస్సాన్స్‌ను అందుకొంటున్నది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 1 కోటి రూపాయలు, ఇతర ప్రాంతాల్లో 50 లక్షల రూపాయలు రాబట్టింది. ఇక రెండో రోజు ఆంధ్రా, నైజాంలో 1.5 కోట్ల రాబట్టింది. ఇండియా వైడ్ 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం భారీ చిత్రాలను మించి కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం గత రెండు రోజుల్లో నైజాంలో 1 కోటి రూపాయలు, సీడెడ్‌లో 22 లక్షల రూపాయలు, ఆంధ్రాలో 1.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 2.5 కోట్ల రూపాయల షేర్.. 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం కర్ణాటక, తమిళనాడులో కలిపి 1.5 కో ట్లు షేర్.. 2.8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా 2 రోజుల్లో 4 కోట్ల షేర్.. 7 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
ఇక మూడో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. బాక్సాఫీస్ వద్ద మహా జోరును చూపిస్తున్నది. ఈ చిత్రం ఉదయం ఆటలకు 70 శాతం ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం ఆటలకు 95 శాతం ఆక్యుపెన్సీ, సాయంత్రం ఆటలకు 90 శాతం, రాత్రి ఆటలకు 85 శాతానికిపైగా ఆక్యుపెన్సీని నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, మహాబూబ్ నగర్, కాకినాడ, వరంగల్‌లో 60 నుంచి 90 శాతం, వైజాగ్ 90 శాతం, ముంబైలో 80 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
ఇక 3వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా 3 నుంచి 3.5 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్లు, కర్ణాటక, తమిళనాడులో 1 కోటి రూపాయలు వసూలు చేయవచ్చు. ఇక అమెరికాలో ఘాటి, మదరాసి సినిమాలకు ధీటుగా కలెక్షన్లను సాధిస్తున్నది. మూడో రోజు హరిహర వీరమల్లు వసూళ్లను కూడా అధిగమించిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు ప్రస్తావిస్తున్నారు. అమెరికాలో కడపటి వార్తలు అందేసరికి మూడో రోజు 150K డాలర్లు వసూలు చేసిందని తెలిపారు.
ఇక ఈ మూవీ మూడు రోజుల్లో దాదాపు 10 కోట్ల రూపాయల కలెక్షన్ల మైలురాయిని అధిగమించడం ఖాయం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్ల రూపాయలు. ఇప్పటికే ఈ సినిమా భారీ లాభాలతో ముందుకెళ్తున్నది. ఈ సినిమా చిన్న సినిమాల్లో రికార్డు క్రియేట్ చేయడం ఖాయమని తేలిపోయింది.


Click it and Unblock the Notifications











