Little Hearts Box Office Collections: షాకింగ్‌గా లిటిల్ హర్ట్స్ కలెక్షన్లు.. చిన్న మూవీకి ఎన్ని కోట్లంటే?

సోషల్ మీడియా ఇన్ల్పూయెన్సర్, 90s మిడిల్ క్లాస్ బయోపిక్‌తో మంచి గుర్తింపు తెచ్చుకొన్న టీనేజ్ స్టార్ మౌళీ తనుజ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీతో పాపులారిటీ సంపాదించుకొన్న శివానీ నాగారం జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ చిత్రం లిటిల్ హార్ట్స్. 90s మిడిల్ క్లాస్ బయోపిక్‌ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా మారి రూపొందించిన చిత్రానికి తొలి చిత్ర దర్శకుడు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద రాబడుతున్న కలెక్షన్ల వివరాలు ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

లిటిల్ హార్ట్స్ సినిమాకు సింజిత్ యెర్రమల్లి సంగీతం, సూర్య బాలాజీ సినిమాటోగ్రఫి, శ్రీధర్ సొంపలి ఎడిటర్‌గా, దివ్య పవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను సుమారుగా 2.5 కోట్ల రూపాయలతో నిర్మించారు. యంగ్ టాలెంట్ కూర్పుతో రూపొందిన ఈ సినిమా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఈటీవీ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై స్ట్రాంగ్ కంటెంట్‌తో రూపొందింది. ఈ మూవీ రిలీజ్‌కు ముందే ప్రీమియర్లను ప్రదర్శించారు. ఈ సినిమాకు బ్రహ్మండమైన రెస్సాన్ రావడంతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్‌గా డిస్ట్రిబ్యూట్ చేశారు.

Little Hearts Box Office Collections

టీనేజ్ అంటే బీటెక్ స్థాయి విద్యార్థుల అల్లరి పనులు, యుక్త వయసులో ఉన్న ఇద్దరు ప్రేమలో పడితే పరిస్థితులు ఏమిటి? అబ్బాయి కంటే అమ్మాయి వయసు ఎక్కువగా ఉండటం వారి ప్రేమకు అడ్డంకిగా మారడం లాంటి ఫన్ ఎలిమెంట్స్‌తో కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. క్లీన్ కామెడీతో వన్ లైనర్, పంచ్ డైలాగ్స్‌తో థియేటర్‌లో నవ్వుల పూలు పూయించడం వల్ల ఈ సినిమా ఫీల్ గుడ్‌గా మారింది. అయితే మౌత్ టాక్‌తో ఈ సినిమాకు తొలి రోజే హౌస్‌ఫుల్ బోర్డులతో గ్రాండ్‌గా బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.

లిటిల్ హార్ట్స్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఆటల నుంచే మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. అగ్ర దర్శకులు, నటుల భారీ సినిమాల పోటీని తట్టుకొని ఈ మూవీ సుమారుగా 40 నుంచి 45 శాతం ఆక్యుపెన్సీని సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమా హైదరాబాద్‌లో దాదాపు 90 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఈ సినిమా తొలి రోజు 5 వేల టికెట్లు అమ్ముడు పోయాయి. ఈ చిత్రం ఆరు షో ద్వారా 8 లక్షల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఓవర్సీస్‌లో కూడా లిటిల్ హార్ట్స్ చిత్రానికి మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. నార్త్ అమెరికాలోనే కాకుండా ఆస్ట్రేలియాలో కూడా భారీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమా ఆస్ట్రేలియాలో 1100 ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసింది. అమెరికాకు సంబంధించిన కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది. అయితే ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్‌గా 1.5 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X