Little Hearts Day 2 Box Office: రెండో రోజే భారీ లాభాల్లో లిటిల్ హార్ట్స్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

90s మిడిల్ క్లాస్ బయోపిక్‌తో టీనేజ్ స్టార్‌గా మారిన మౌళీ తనుజ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీతో పాపులారిటీ సంపాదించుకొన్న శివానీ నాగారం జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ చిత్రం లిటిల్ హార్ట్స్. 90s మిడిల్ క్లాస్ బయోపిక్‌ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా మారి రూపొందించిన చిత్రానికి తొలి చిత్ర దర్శకుడు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద రాబడుతున్న కలెక్షన్ల వివరాలు ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

లిటిల్ హార్ట్స్ సినిమాకు సింజిత్ యెర్రమల్లి సంగీతం, సూర్య బాలాజీ సినిమాటోగ్రఫి, శ్రీధర్ సొంపలి ఎడిటర్‌గా, దివ్య పవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను సుమారుగా 2.5 కోట్ల రూపాయలతో నిర్మించారు. యంగ్ టాలెంట్ కూర్పుతో రూపొందిన ఈ సినిమా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఈటీవీ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై స్ట్రాంగ్ కంటెంట్‌తో రూపొందింది. ఈ మూవీ రిలీజ్‌కు ముందే ప్రీమియర్లను ప్రదర్శించారు. ఈ సినిమాకు బ్రహ్మండమైన రెస్సాన్ రావడంతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్‌గా డిస్ట్రిబ్యూట్ చేశారు.

Little Hearts Day 2 Box Office

టీనేజ్ అంటే బీటెక్ స్థాయి విద్యార్థుల అల్లరి పనులు, యుక్త వయసులో ఉన్న ఇద్దరు ప్రేమలో పడితే పరిస్థితులు ఏమిటి? అబ్బాయి కంటే అమ్మాయి వయసు ఎక్కువగా ఉండటం వారి ప్రేమకు అడ్డంకిగా మారడం లాంటి ఫన్ ఎలిమెంట్స్‌తో కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. క్లీన్ కామెడీతో వన్ లైనర్, పంచ్ డైలాగ్స్‌తో థియేటర్‌లో నవ్వుల పూలు పూయించడం వల్ల ఈ సినిమా ఫీల్ గుడ్‌గా మారింది. అయితే మౌత్ టాక్‌తో ఈ సినిమాకు తొలి ఆట నుంచే రోజే హౌస్‌ఫుల్ బోర్డులతో గ్రాండ్‌గా బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ఇక ఈ సినిమా రెండు రోజుల్లో పెద్ద సినిమాకు మించి కలెక్షన్లు సాధిస్తున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ చిత్రం ఓవర్సీస్‌లో ప్రీమియర్లు, తొలి రోజు చిన్న సినిమాల్లో భారీ కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం 130K డాలర్లు అంటే.. 1.15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటకలో ఈ చిత్రం 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి రోజు ఈ చిత్రం విడుదలైన అన్నీ చోట్ల కలిపి సుమారుగా 3.75 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక లిటిల్ హార్ట్స్ చిత్రం రెండో రోజు కూడా భారీగా కలెక్షన్లు రాబట్టేందుకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం ఉదయం ఆటకు 50 శాతం ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం ఆటకు 90 శాతం, సాయంత్రం ఆటకు 75 శాతం, సెకండ్ షోలకు 75 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. శుక్ర, శనివారాలు గణేష్ నిమజ్జనం అయినప్పటికీ.. ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబట్టడం విశేషం. హైదరాబాద్, బెంగళూరు, వరంగల్, వైజాగ్, కరీంనగర్, మహబూబ్ నగర్, కాకినాడలో 65 శాతం నుంచి 90 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదైంది.

ఇక ఈ చిత్రం రెండో రోజు కలెక్షన్లు విషయానికి వస్తే.. ఈ చిత్రం వినాయక నిమజ్జనం హడావిడిలో కూడా సంచలనమైన రీతిలో వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం సాయంత్రం ఆటల వరకు వేసిన అంచనాల ప్రకారం.. 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఇంకా బెటర్ ఆక్యుపెన్సీ నమోదైతే.. ఈ వసూళ్ల రేంజ్ పెరిగే అవకాశం ఉంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా రెండు కోట్ల రూపాయలకు చేరువయ్యే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ గత రెండు రోజుల్లో 6 నుంచి 7 కోట్ల మధ్య వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా 3 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసుకొన్నది. చిన్న సినిమా డిస్టిబ్యూటర్లకు భారీ లాభాలను పంచి పెడుతుండటం ఇండస్ట్రీ వర్గాలకు ఉపశమనంగా మారిందనే మాట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X