Little Hearts Day 10 Box Office: లిటిల్ హార్ట్స్ 10 రోజుల వసూళ్లు.. యువ హీరో సెన్సేషన్.. లాభం ఎంతంటే?
టాలీవుడ్‌లో యువ హీరో మౌళి తనుజ్ సెన్సేషన్ గా మారారు. ఆయన చివరిగా 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు రొమాంటిక్ డ్రామా లిటిల్ హార్ట్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ హీరోయిన్ శివానీ నాగారం నటించడం విశేషం. సెప్టెంబర్ 5న తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత? 10వ రోజు కలెక్షన్ ఎంతనే వివరాల్లోకి వెళితే..
లిటిల్ హార్ట్స్ బడ్జెట్ ఎంత?
మౌళి తనుజ్, శివానీ నాగారం హీరోహీరోయిన్లుగా, రాజీవ్ కనకాల తండ్రి పాత్రను పోషించారు. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. డెబ్యూ డైరెక్టర్ సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. దీంతో వారి రెమ్యునరేషన్లు, మూవీ ప్రొడక్షన్ ఖర్చులు, ప్రచార ఖర్చులన్నీ కలుపుకొని రూ.2.5 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఈ చిత్రానికి సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీని అందించగా, సింజిత్ యెర్రమల్లి అద్భుతమైన సంగీతం అందించారు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్?
తొలిరోజే లిటిల్ హార్ట్స్ చిత్రం ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని టాప్ డిస్టిబ్యూటర్లు బన్నీ వాస్, వంశీ నందిపాటి రిలీజ్ చేయడం విశేషం. ఇక సినిమా కథ, నటీనటుల పెర్ఫామెన్స కూడా అదిరిపోయింది. దీంతో థియేట్రికల్ రన్ ద్వారా సినిమాకు రూ.3 కోట్ల షేర్, రూ.6 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను నిర్ణయించారు.
9 రోజుల కలెక్షన్స్..
ఓపెనింగ్ డే రూ.1.35 కోట్లు, 2.4 కోట్లు, 3వ రోజు రూ.3.6 కోట్లు, 4వ రోజు రూ.2.30 కోట్ల ఇండియా నెట్, 5వ రోజు రూ.2.25 కోట్ల, 6వ రోజు రూ.1.85 కోట్లు, 7వ రోజు రూ.1.5 కోట్లు, 8వ రోజు రూ.1.4 కోట్లు, 9వ రోజు రూ.2 కోట్లు ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు వెల్లడించాయి.
10వ రోజు వసూళ్లు..
రోజురోజుకు లిటిల్ హార్ట్స్ కలెక్షన్లు పెరుగుతున్నాయి. ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎండీబీ ఈ చిత్రానికి 8.6 రేటింగ్ ఇవ్వడంతో సినిమాకు మరింత వాల్యూ వచ్చింది. థియేటర్లలో రోజురోజుకు ఫుట్ ఫాల్ పెరుగుతోంది. ఇక సెప్టెంబర్ 14న ఆదివారం 50 శాతం వరకు థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు రూ.1.50 కోట్లు ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ ఏర్లీ రిపోర్ట్ ఇచ్చింది. మిగితా నైట్ షోలు కలుపుకొని 10వ రోజు రూ.3 కోట్ల ఇండియా నెట్, రూ.6 కోట్ల ఇండియా గ్రాస్ వసూల్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
లిటిల్ హార్ట్స్ 9 రోజుల్లో ఇండియా నెట్ రూ.17 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.20 కోట్లు, ఓవర్సీస్ లో రూ.6 కోట్ల గ్రాస్ వసూలైందని ట్రేడ్ నిపుణులు తెలిపారు. ఇక ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని రూ.26 కోట్లు వసూల్ అయ్యిందని ట్రేడ్ వర్గాల లెక్కల చెబుతున్నాయి. ఈ లెక్కన లిటిల్ హార్ట్స్ చిత్రం 2 వారాలు గడవక ముందే రూ.20 కోట్ల లాభాన్ని తెచ్చి పెట్టిందని నిపుణులు వెల్లడిస్తున్నారు.


Click it and Unblock the Notifications











