Little Hearts Day 15 Collection: 15 రోజుల్లో లిటిల్ హార్ట్స్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వసూలైంది? లాభం ఎంత?

యంగ్ టాలెంటెడ్ తో రూపొందించిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా లిటిల్ హార్ట్స్. ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న బడ్జెట్ చిత్రంగా థియేటర్లలో అడుగు పెట్టి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్రం 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. 90s మిడిల్ క్లాస్ బయోపిక్‌ సిరీస్ ఫేమ్ మౌలి తనుజ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీ ఫేమ్ శివానీ నాగారం జంటగా నటించారు. సాయి మార్తాండ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? 15వ రోజు ఎంత కలెక్ట్ చేసిందనే వివరాల్లోకి వెళితే..

లిటిల్ హార్ట్స్ మూవీ బడ్జెట్? బ్రేక్ ఈవెన్?
మౌలి తనుజ్, శివానీ నాగారం, రాజీవ్ కనకాల, తదితర యంగ్ టాలెంట్ కీలక పాత్రలు పోషించాయి. 90s మిడిల్ క్లాస్ బయోపిక్‌ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందించారు. నటీనటుల, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు కలుపుకొని రూ.2.5 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్టిబ్యూటర్లు బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్దగా కాలేకపోయినా, ఈ చిత్రం థియేట్రికల్ రన్ ద్వారా రూ.3 కోట్ల షేర్, రూ.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను నిర్ణయించారు.

Little Hearts Telugu Movie 15 Days Box Office Collections Worldwide

14 రోజుల కలెక్షన్లు..
ఓపెనింగ్ డే రూ.1.35 కోట్లు, 2.4 కోట్లు, 3వ రోజు రూ.3.6 కోట్లు, 4వ రోజు రూ.2.30 కోట్ల ఇండియా నెట్, 5వ రోజు రూ.2.25 కోట్ల, 6వ రోజు రూ.1.85 కోట్లు, 7వ రోజు రూ.1.5 కోట్లు, 8వ రోజు రూ.1.4 కోట్లు, 9వ రోజు రూ.2 కోట్లు, రూ.10వ రోజు రూ.2 కోట్లు, 11వ రోజు రూ.60 లక్షలు, 12వ రోజు రూ.56 లక్షలు, 13వ రోజు రూ.47 లక్షలు, 14వ రోజు రూ.45 లక్షలు వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి.

15వ రోజు..
ప్రస్తుతం లిటిల్ హార్ట్స్ చిత్రం థియేట్రికల్ రన్ ద్వారా స్టడీగా వసూళ్లు రాబడుతోంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. శుక్రవారం సెప్టెంబర్ 19న వర్కింగ్ డే అయినప్పటికీ రూ.41 లక్షలు ఇండియా నెట్ వసూల్ చేసింది. దీంతో ఈ చిత్రం రూ.23.20 కోట్ల ఇండియా నెట్‌కు చేరుకుంది.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
లిటిల్ హార్ట్స్ ఇండియా నెట్ రూ.22.20 కోట్లు కాగా, ఇండియా గ్రాస్ రూ.24.90 కోట్లకు చేరుకుందని, ఓవర్సీస్ నుంచి రూ.9 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ కలుపుకొని వరల్డ్ వైడ్ గా రూ.34 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. ఈ లెక్కన లిటిల్ హార్ట్స్ చిత్రం రూ.30 కోట్ల లాభాన్ని అందుకోవడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X