Little Hearts Day 17 Collection: లిటిల్ హార్ట్స్ 17వ రోజు వసూళ్లు.. పట్టువదలని యువ హీరో.. ఎన్ని కోట్లంటే?
యువ హీరో హీరోయిన్ మౌలి తనుజ్, శివానీ నాగారం జంటగా నటించిన రొమాంటిక్ ఫిల్మ్ లిటిల్ హార్ట్స్. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ తో మౌలి తనుజ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీతో శివానీ నాగారం ఫేమ్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇక వారిద్దరూ కలిసి ఇప్పుడు ఇలాంటి బ్యూటీఫుల్ మూవీలో నటించడం విశేషం. ఈ సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. చిన్న బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లును అందుకుంటోంది. కాగా ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 17వ రోజు ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందనే వివరాల్లోకి వెళితే..
లిటిల్ హార్ట్స్ మూవీ బడ్జెట్? బ్రేక్ ఈవెన్?
లిటిల్ హార్ట్స్ చిత్రంలో మౌలి తనుజ్, శివానీ నాగారం, రాజీవ్ కనకాల, తదితర యువ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రానికి నిర్మాతగా 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ వ్యవహరించడం విశేషం. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందించిన ఈ చిత్రానికి రూ.2.5 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే థియేట్రికల్ రన్ ద్వారా రూ.3 కోట్ల షేర్, రూ.6 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.

17 రోజుల కలెక్షన్లు..
ఓపెనింగ్ డే రూ.1.35 కోట్లు, 2.4 కోట్లు, 3వ రోజు రూ.3.6 కోట్లు, 4వ రోజు రూ.2.30 కోట్ల ఇండియా నెట్, 5వ రోజు రూ.2.25 కోట్ల, 6వ రోజు రూ.1.85 కోట్లు, 7వ రోజు రూ.1.5 కోట్లు, 8వ రోజు రూ.1.4 కోట్లు, 9వ రోజు రూ.2 కోట్లు, రూ.10వ రోజు రూ.2 కోట్లు, 11వ రోజు రూ.60 లక్షలు, 12వ రోజు రూ.56 లక్షలు, 13వ రోజు రూ.47 లక్షలు, 14వ రోజు రూ.45 లక్షల ఇండియా నెట్ వసూల్ చేసింది. ఇలా 2 వారాల్లో ఈ చిత్రం రూ.22.85 కోట్ల వరకు ఇండియా నెట్ ను వసూల్ చేసింది.
ఇక 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత 15వ రోజు రూ.45 లక్షలు, 16వ రోజు రూ.80 లక్షలు, 17వ రోజు రూ.88 లక్షలు వసూల్ చేసినట్టు సాక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇలా 17 రోజుల్లో ఇండియా నెట్ రూ.25 కోట్లకు చేరుకుంది. 3వ వారంలోనూ లిటిల్ హార్ట్స్ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్టడీగా వసూళ్లు రాబడుతోంది.
వరల్డ్ వైడ్ గా..
3వ వారంలోనూ స్టడీగా వసూళ్లు రాబడుతున్న లిటిల్ హార్ట్స్ మూవీ ఇండియా నెట్ 17వ రోజు వరకు రూ.25 కోట్లకు చేరుకుంది. ఇక ఇండియా గ్రాస్ రూ.28 కోట్లు అయ్యిందని, ఓవర్సీస్ నుంచి రూ.9 కోట్ల గ్రాస్ వసూలైందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇలా ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ కలుపుకొని వరల్డ్ వైడ్ గా రూ.37 కోట్ల గ్రాస్ వసూల్ అయ్యిందని తెలుపుతున్నారు. ఇందులో నుంచి మేకర్స్ రూ.32 కోట్ల వరకు లాభం అందుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications











