Little Hearts Day 4 Box Office: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న లిటిల్ హార్ట్స్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
90s మిడిల్ క్లాస్ బయోపిక్‌తో టీనేజ్ స్టార్‌గా మారిన మౌళీ తనుజ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీతో పాపులారిటీ సంపాదించుకొన్న శివానీ నాగారం జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ చిత్రం లిటిల్ హార్ట్స్. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా మారి రూపొందించిన చిత్రానికి తొలి చిత్ర దర్శకుడు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద రాబడుతున్న కలెక్షన్ల వివరాలు ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
లిటిల్ హార్ట్స్ సినిమాకు సింజిత్ యెర్రమల్లి సంగీతం, సూర్య బాలాజీ సినిమాటోగ్రఫి, శ్రీధర్ సొంపలి ఎడిటర్‌గా, దివ్య పవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. యంగ్ టాలెంట్ కూర్పుతో రూపొందిన ఈ సినిమా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఈటీవీ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై స్ట్రాంగ్ కంటెంట్‌తో రూపొందింది. ఈ సినిమాను సుమారుగా 2.5 కోట్ల రూపాయలతో నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్‌గా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సినిమా 3 కోట్ల రూపాయల షేర్, 6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందడంతో కాసుల పంట పండుతున్నది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ బడ్జెట్ సినిమాలను మించిన వసూళ్లను రాబట్టి సూపర్ హిట్‌గా మారింది. రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ ఈ సినిమా 3 రోజుల్లో 12.21 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వరల్డ్ వైడ్‌గా నమోదు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్టు వివరాల్లోకి వెళితే... తొలి రోజు 1 కోటి రూపాయలు, రెండో రోజు 1.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నైజాంలో 2 కోట్లు, సీడెడ్‌లో 50 లక్షలు, ఆంధ్రాలో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 4.5 కోట్ల రూపాయల షేర్ 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా 2.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 10.25 కోట్ల ఇండియాలో వసూలు చేసింది.
ఓవర్సీస్‌లో లిటిల్ హార్ట్స్ చిత్రం భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం తొలి రోజు 115K, రెండో రోజు 160K, మూడో రోజు 150K డాలర్లు వసూలు చేసింది. దాంతో అమెరికాలో మొత్తంగా 425K డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 3.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 14 కోట్ల రూపాయలు వసూలు చేసిందని అంచనా వేశారు. ఇక 4వ రోజు విషయానికి వస్తే.. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రూపాయల నుంచి 1.5 కోట్ల వసూళ్లు, ప్రపంచవ్యాప్తంగా 2 నుంచి 2.5 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











