Little Hearts Day 5 Box Office : డబుల్ ప్రాఫిట్.. లిటిల్ హార్ట్స్ 5వ రోజు వసూళ్లు.. ఎన్ని కోట్ల లాభమంటే?

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల కంటే చిన్న బడ్జెట్ సినిమాలకే మంచి ప్రాఫిట్స్ అందుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా థియేటర్లలోకి వచ్చిన చిత్రమే లిటిల్ హార్ట్స్. ఈ చిత్రం సెప్టెంబర్ 5న శుక్రవారం విడుదలైంది. 90s మిడిల్ క్లాస్ బయోపిక్‌ ఫేమ్ మౌళి తనుజ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీ ఫేమ్ శివానీ నాగారం కలిసి నటించిన చిత్రమిది. రొమాంటిక్ చిత్రంగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 90s మిడిల్ క్లాస్ బయోపిక్‌ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. డెబ్యూ డైరెక్టర్ గా సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 5వ రోజు వరల్డ్ వైడ్ ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తుందనే వివరాల్లోకి వెళితే..

లిటిల్ హార్ట్స్ బడ్జెట్ ఎంత?
యువ హీరో, హీరోయిన్లు, డెబ్యూ డైరెక్టర్ కావడంతో సినిమాకు భారీగా ఖర్చేమీ కాలేదు. సింజిత్ యెర్రమల్లి సంగీతం, సూర్య బాలాజీ సినిమాటోగ్రఫి, శ్రీధర్ సొంపలి ఎడిటర్‌గా, దివ్య పవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇలా టాలెంటెడ్ టీమ్ తో ఈటీవీ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూ.2.5 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

Little Hearts Telugu Movie 5 Days Box Office Collections Worldwide

బ్రేక్ ఈవెన్ టార్గెట్?
మౌళి, శివానీ నాగారం కలిసి జంటగా నటించిన చిత్రం కావడం, వీరికి ఇప్పటికే యూత్ లో ఫాలోయింగ్ ఉండటంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ప్రమోషన్స్ ను ఆకట్టుకునేలా చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్‌గా డిస్ట్రిబ్యూట్ చేశారు. దీంతో ఈ సినిమా రూ.3 కోట్ల షేర్, రూ.6 కోట్ల గ్రాస్ బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేయాలని ట్రేడ్ పండితులు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌‌ను నిర్ణయించారు.

4 రోజుల వసూళ్లు..
ఓపెనింగ్ డే రూ.1.35 కోట్లు, 2.4 కోట్లు, 3వ రోజు రూ.3.6 కోట్లు, 4వ రోజు రూ.2.25 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ తెలిపింది. ఇలా ఇండియా నెట్ 4వ రోజు వరకు రూ.9.60 కోట్ల వరకు వసూల్ చేసింది. ఇక ఇండియా గ్రాస్ రూ.11.5 కోట్ల ఇండియా గ్రాస్, ఓవర్సీస్ లో రూ.3.5 కోట్ల గ్రాస్ వసూలైందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. వరల్డ్ వైడ్ గా రూ.15 కోట్ల వరకు గ్రాస్ వసూలైంది.

5వ రోజు వసూళ్లు..
ఇక 5వ రోజు సాయంత్రం 6 గంటల వరకు రూ.90 లక్షలు వసూలైందని సాక్ నిక్ లెక్కలు తెలుపుతున్నాయి. మిగిలిన రెండు షోలు కలుపుకొని 5వ రోజు రూ.2 కోట్ల వరకు వసూల్ చేసి ఉంటుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో వరల్డ్ వైడ్ గా రూ.18 వరకు గ్రాస్ వసూల్ చేసి ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి.

లాభం ఎంతంటే?
లిటిల్ హార్ట్స్ చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరుగా వసూళ్లను సాధిస్తోంది. సక్సెస్ రేట్ లో భారీ చిత్రాలకంటే బాక్సాఫీస్ వద్ద బెటర్ గా పెర్ఫామ్ చేస్తోందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్ల రూపాయాలను దాటేసి, మరో 12 కోట్ల గ్రాస్ లాభాన్ని అందుకుందని తెలుపుతున్నారు. ఇలా డబుల్ ప్రాఫిట్ అందుకోవడంతో సినిమాకు మరింత ప్రచారం దక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X