Little Hearts Day 6 Box Office : యువ హీరో సంచలనం.. లిటిల్ హార్ట్స్ 6వ రోజు కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?
ఇటీవల కాలంలో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను అందుకుంటున్నాయి. తక్కవ బడ్జెట్ తో వచ్చిన చిత్రాలు మంచి ఫలితాలను చూస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే లిటిల్ హార్ట్స్. ఈ రొమాంటిక్ డ్రామాలో 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ ఫేమ్ మౌళి తనుజ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ హీరోయిన్ శివానీ నాగారం జంటగా నటించారు. సెప్టెంబర్ 5న శుక్రవారం విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో లిటిల్ హార్ట్స్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 6వ రోజు ఎన్ని కోట్లు వసూల్ చేసిందనే వివరాల్లోకి వెళితే..
లిటిల్ హార్ట్స్ బడ్జెట్ ఎంత?
ఈ చిత్రాన్ని 90s మిడిల్ క్లాస్ బయోపిక్ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మించడం విశేషం. డెబ్యూ డైరెక్టర్ గా సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. రైజింగ్ యాక్టర్స్ లీడ్ గా నటించడం, టాలెంటెడ్ డైరెక్టర్, సినీయర్ టెక్నీషియన్లు పనిచేశారు. దాంతో సినిమాకు తక్కువ బడ్జెట్టే అయ్యింది. సింజిత్ యెర్రమల్లి సంగీతం, సూర్య బాలాజీ సినిమాటోగ్రఫి, శ్రీధర్ సొంపలి ఎడిటర్‌గా, దివ్య పవన్ ఆర్ట్ డైరెక్టర్ బాధ్యతలు చూశారు. ఈటీవీ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూ.2.5 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్?
చిన్న బడ్జెట్ సినిమాలకు మంచి ప్రాఫిట్స్ ఉంటుండటం కారణంగా ఈ సినిమాను టాప్ డిస్టిబ్యూటర్లు విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు. లిటిల్ హార్ట్స్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేశారు. ఇలా థియేట్రికల్ రన్ ద్వారా ఈ చిత్రం రూ.3 కోట్ల షేర్, రూ.6 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.
5 రోజుల వసూళ్లు..
ఓపెనింగ్ డే రూ.1.35 కోట్లు, 2.4 కోట్లు, 3వ రోజు రూ.3.6 కోట్లు, 4వ రోజు రూ.2.30 కోట్ల ఇండియా నెట్, 5వ రోజు రూ.2.25 కోట్ల ఇండియా నెట్ వసూలైందని సాక్ నిక్ వెల్లడించింది. దీంతో 5 రోజుల వరకు ఇండియా నెట్ రూ.11.90 కోట్లకు చేరుకుంది. ఇండియా గ్రాస్ రూ.13.85 కోట్లకు చేరుకుంది. ఓవర్సీస్ లో రూ.4.65 కోట్ల గ్రాస్ వసూలైంది. వరల్డ్ వైడ్ గా రూ.18.50 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి.
6వ రోజు వసూళ్లు..
సెప్టెంబర్ 10న లిటిల్ హార్ట్స్ చిత్రం బాక్సాఫీస్ వద్ద 6వ రోజు కూడా మంచి వసూళ్లనే అందుకుంటోంది. బుధవారం వర్కింగ్ డే అయినప్పటికీ సాయంత్రం 4 గంటల వరకు రూ.60 లక్షల ఇండియా నెట్ వసూలైందని సాక్ నిక్ తాజాగా రిపోర్ట్ ఇచ్చింది. ఇక నైట్ షోల కలెక్షన్స్ కలుపుకొని కేవలం 6వ రోజు రూ.2 కోట్ల వరకు ఇండియా నెట్ వసూల్ అవుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక 6వ రోజు మార్నింగ్ 24 శాతం, మధ్యాహ్నం 29 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. ఇక ఈ చిత్రం రూ.6 కోట్ల బ్రేక్ ఈవెన్ ను దాటుకొని రూ.13 కోట్ల వరకు గ్రాస్ లాభాన్ని అందుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications











