Little Hearts Day 9 Box Office : లిటిల్ హార్ట్స్ 9వ రోజు వసూళ్లు.. లాభం ఎన్ని కోట్లు వచ్చిందంటే?
90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ ఫేమ్ మౌళి తనుజ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ హీరోయిన్ శివానీ నాగారం జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ లిటిల్ హార్ట్స్. ఇటీవల కాలంలో వచ్చిన చిన్న చిత్రాల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ గా వసూల్ చేస్తోంది. తక్కవ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ డ్రామా లిటిల్ హార్ట్స్ సెప్టెంబర్ 5న విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం విశేషం. కాగా ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్? బ్రేక్ ఈవెన్ టార్గెట్? 9వ రోజు ఎన్ని కోట్లు వసూల్ చేసిందనే వివరాల్లోకి వెళితే..
లిటిల్ హార్ట్స్ బడ్జెట్ ఎంత?
లిటిల్ హార్ట్స్ చిత్రాన్ని 90s మిడిల్ క్లాస్ బయోపిక్ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా మారి రూపొందించారు. డెబ్యూ డైరెక్టర్ సాయి మార్తాండ్ దర్శకత్వం వహించడం విశేషం. యువ నటీనటలు, టాలెంటెడ్ క్రూ పనిచేసినా భారీ స్థాయిలో ఖర్చేమీ కాలేదని తెలుస్తోంది. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చులన్నీ కలుపుకొని రూ.2.5 కోట్ల బడ్జెట్ అయ్యిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సూర్య బాలాజీ సినిమాటోగ్రఫి, శ్రీధర్ సొంపలి ఎడిటర్‌గా, సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించారు. ఈటీవీ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై విడుదలైంది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్?
ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడటంతో టాప్ డిస్టిబ్యూటర్లు విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో లిటిల్ హార్ట్స్ చిత్రాన్ని నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. థియేట్రికల్ రన్ ద్వారా ఈ సినిమాకు రూ.3 కోట్ల షేర్, రూ.6 కోట్ల గ్రాస్ వసూలైతే లాభాల భాటలోకి పయనించనుంది.
8 రోజుల వసూళ్లు..
ఓపెనింగ్ డే రూ.1.35 కోట్లు, 2.4 కోట్లు, 3వ రోజు రూ.3.6 కోట్లు, 4వ రోజు రూ.2.30 కోట్ల ఇండియా నెట్, 5వ రోజు రూ.2.25 కోట్ల, 6వ రోజు రూ.1.85 కోట్లు, 7వ రోజు రూ.1.5 కోట్లు కలెక్ట్ చేసింది. వారంలో రోజుల్లో రూ.15.25 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసింది. ఇక 8వ రోజు రూ.1.37 కోట్లు ఇండియా నెట్ వసూల్ చేసింది.
9వ రోజు వసూళ్లు..
లిటిల్ హార్ట్స్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో 2వ వారంలోనూ మంచి వసూళ్లను సాధించింది. ఇక 9వ రోజు సాయంత్రం 4 గంటల వరకు రూ.80 లక్షల వసూళ్లు కలెక్ట్ చేసిందని, ఇక మిగితా షోల వసూళ్లు కలుపుకొని రూ.2 కోట్ల వరకు ఇండియా నెట్ వసూల్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇండియా నెట్ రూ.19 కోట్ల వరకు చేరుకుంటుందని అభిప్రాయ పడుతున్నారు.
లిటిల్ హార్ట్స్ చిత్రం 8 రోజుల్లో రూ.17 కోట్ల ఇండియా నెట్, ఇక ఇండియా గ్రాస్ రూ.19 కోట్లు, ఓవర్సీస్ లో రూ.6 కోట్ల గ్రాస్ వసూలైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇండియా + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా రూ.24 కోట్ల గ్రాస్ వసూలైందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. దీంతో లిటిల్ హార్ట్స్ చిత్రానికి రూ.18 కోట్ల వరకు గ్రాస్ లాభం వచ్చిందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు.


Click it and Unblock the Notifications











