Lokah 18 days Collections: 250 కోట్ల క్లబ్‌లో లోక మూవీ.. మోహన్‌లాల్ ఎంపురాన్ రికార్డు అవుట్

మలయాళ సినిమా పరిశ్రమలో ఓనమ్ పండుగ సందర్భంగా విడుదలైన చిత్రాలు కేరళ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఈ పండుగ బరిలో స్టార్ హీరోలు మోహన్‌లాల్, ఫాహద్ ఫాజిల్‌తోపాటు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాతో యువ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్, మరో లవ్ రొమాంటిక్ చిత్రం మైనే ప్యార్ కియా చిత్రం పోటిపడ్డాయి. అయితే ఈ నాలుగు సినిమాల్లో ముఖ్యంగా మోహన్ లాల్ నటించిన హృదయపూర్వమ్, కల్యాణ్ ప్రియదర్శన్ నటించిన లోక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అనే విధంగా కలెక్షన్లు రాబడుతున్నాయి. ఈ రెండు సినిమాల గురించిన విషయాల్లోకి వెళితే..

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారి డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లోక చాప్టర్ 1 చంద్ర. ఈ చిత్రంలో ప్రేమలు హీరో నస్లేన్, కల్యాణి ప్రియదర్శిని జంటగా నటించారు. కూలీ ఫేమ్ షౌబీన్, స్టార్ హీరో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి సినిమాటోగ్రఫి, చమన్ ఛాక్కో సినిమాటోగ్రఫిని అందించారు.

Lokah 18 days Box Office

ఓనమ్ పండుగ సందర్భంగా ఈ సినిమా 28 ఆగస్టున రిలీజ్ అయింది. ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కాస్ట్‌తో కలిపి ఈ మూవీని సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 50 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

లోక చాప్టర్ 1 చిత్రం గత 18 రోజుల్లో ఇండియాలో కలెక్షన్లు వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో 12.5 కోట్ల రూపాయలు, తెలుగులో 14 కోట్ల రూపాయలు, తమిళంలో 17 కోట్ల రూపాయలు, కేరళలో 90.5 కోట్ల రూపాయలు, నార్త్, ఇతర రాష్ట్రాల్లో 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం ఇప్పటి వరకు 135 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు రాబట్టింది అని ట్రెడ్ వర్గాలు చెప్పాయి.

లోక చిత్రం 18వ రోజున కూడా రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా మూడో ఆదివారం రోజున 6.8 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక తెలుగులో 40 లక్షల రూపాయల నెట్ 80 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 7.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో 135 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

లోక చిత్రం ఓవర్సీస్‌ బాక్సాఫీస్‌ను అల్లాడించింది. ఈ చిత్రం గత మూడు వారాల వ్యవధిలో 105 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒక సూపర్ హీరోయిన్ సినిమా, అలాగే మలయాళ చిత్రం ఇటీవల కాలంలో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం ఇదే తొలిసారి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 240 కోట్లకుపైగా గ్రాస్, 120 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ 26 కోట్ల రూపాయలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లకుగా నిర్ణయించారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం 90 కోట్ల రూపాయల లాభాలను వసూలు చేసింది.

ఈ సినిమా మలయాళ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తున్నది. కేరళ సినిమా రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఎంపురాన్ 2 సినిమా రికార్డులను అధిగమించింది. త్వరలోనే ఈ సినిమా నంబర్ 1 చిత్రంగా రికార్డు క్రియేట్ చేస్తుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X