Lokah Collections: ఓజీ తుఫానులోనూ లోక హవా.. కేజీఎఫ్ 2 రికార్డ్ బ్రేక్ చేసిన దుల్కర్ మూవీ
విడుదలైన నాటి నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, ఒక్కో సినిమా రికార్డును బద్ధలు కొడుతూ వస్తోంది లోక చాప్టర్ 1: చంద్ర. ఇండియాతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ కలెక్షన్స్‌తో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది లోక. ఇప్పటికే మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా ఉన్న ఎల్ 2: ఎంపురాన్ రికార్డును బద్ధలుకొట్టిన లోక.. ఈసారి ఏకంగా కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 రికార్డును బ్రేక్ చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
లోక చాప్టర్ 1: చంద్ర చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా.. కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్‌లు లీడ్ రోల్స్ పోషించారు. ఆగస్ట్ 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమాను మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మించారు. షౌబీన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్‌లు అతిథి పాత్రలో కనిపించారు. నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయ రాఘవన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి, చమన్ చాకోలు సినిమాటోగ్రఫిని అందించారు.

లోక చాప్టర్ 1 చంద్ర బడ్జెట్
లోక చాప్టర్ 1 చంద్ర సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి లోక చాప్టర్ 1 చంద్ర మూవీని సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. భారీ అంచనాల నేపథ్యంలో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. లోక చాప్టర్ 1 చంద్ర మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 50 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి.
లోక చాప్టర్ 1 చంద్ర వసూళ్లు
కళ్యాణి ప్రియదర్శన్ మూవీ ఇండియా తొలి వారం 64 కోట్ల రూపాయలు, రెండో వారం 56 కోట్ల రూపాయలు, మూడో వారం 32 కోట్ల రూపాయలు, నాలుగో వారం 16 కోట్ల రూపాయలు రాబట్టింది. మొత్తంగా 33 రోజుల వరకు ఇండియా వైడ్‌గా 147 కోట్ల రూపాయల నెట్.. 173 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో అయితే దుల్కర్ మూవీకి ఎదురు లేకుండా సాగుతోంది. ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లు సాధించడం వెనుక ఓవర్సీస్ మార్కెట్ కీ రోల్ ప్లే చేసింది. నార్త్ అమెరికా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలతో కలిపి ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు లోక చాప్టర్ 1: చంద్ర చిత్రం 118 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబ్టటింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ ప్లస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి కళ్యాణి ప్రియదర్శన్ మూవీకి 33 రోజుల వరకు 292 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో లోక చాప్టర్ 1 వసూళ్లు
సూపర్ ఉమెన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీని కేరళతో సమానంగా ఆదరించారు తెలుగు ప్రేక్షకులు.. ఆంధ్రా, నైజాంలలో లోక చాప్టర్ 1: చంద్ర మూవీకి తొలి వారం 9 కోట్ల రూపాయలు, రెండో వారం 6 కోట్ల రూపాయలు, మూడో వారం 5 కోట్ల రూపాయలు, నాలుగో వారం 3 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 24 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందించింది. ఇండియాలోని పలు రాష్ట్రాలలో లోక చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. మలయాళంలో 115 కోట్ల రూపాయలు, తమిళంలో 16 కోట్ల రూపాయలు, తెలుగులో 24 కోట్ల రూపాయలు, కన్నడంలో 9 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 11 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
కేజీఎఫ్ 2 రికార్డ్ బ్రేక్
రికార్డులను వేటాడుతూ.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న లోక చాప్టర్ 1 చంద్ర మూవీ ఈ క్రమంలో మిడిల్ ఈస్ట్‌లో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మిడిల్ ఈస్ట్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రాల్లో ప్రశాంత్ నీల్ - యశ్‌ల కేజీఎఫ్ 2 మూవీ రికార్డుల్ని లోక బద్ధలు కొట్టింది. కేజీఎఫ్ 2 లాంగ్ రన్‌లో మిడిల్ ఈస్ట్‌లో 8.15 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 67.79 కోట్ల రూపాయలు) రాబట్టి మూడో స్థానంలో ఉంది. తాజాగా లోక చిత్రం కేవలం 32 రోజుల్లోనే మిడిల్ ఈస్ట్‌లో 8.294 మిలియన్ డాలర్లు (68.82 కోట్ల రూపాయలు) రాబట్టి మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ లిస్ట్‌లో బాహుబలి 2 (10.31 మిలియన్ డాలర్లు)తో నెంబర్‌వన్‌గా నిలవగా, తర్వాత ఎల్ 2: ఎంపురాన్ 9.72 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచాయి.


Click it and Unblock the Notifications











