Lokah Chapter 1 Total Collection: లోక చాప్టర్ 1 టోటల్ కలెక్షన్స్... 65 కోట్లతో తీస్తే ఎన్ని కోట్ల లాభమంటే?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం లోక చాప్టర్ 1 చంద్ర. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్‌లు కీలకపాత్రలు పోషించగా... కూలీ ఫేమ్ షౌబీన్, స్టార్ హీరో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో నటించారు. నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయరాఘవన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి, చమన్ చాకోలు సినిమాటోగ్రఫిని అందించారు. లోక చాప్టర్ 1 చంద్ర సినిమా బడ్జెట్ ఎంత? థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా టోటల్‌గా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది? దుల్కర్ సల్మాన్‌కు లాభమెంత? నష్టమెంత?ఈ వివరాలు పరిశీలిస్తే..
లోక చాప్టర్ 1 చంద్ర బడ్జెట్ ఎంత?
హార్రర్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు నిర్మాత దుల్కర్ సల్మాన్. ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయకుండా నిర్మించారు. హార్రర్ అనుభూతిని అందించేందుకు గాను అధునాతన డీటీఎస్, వీఎఫ్ఎక్స్ టెక్నాలజీకి భారీగా ఖర్చుపెట్టారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి లోక చాప్టర్ 1 చంద్ర మూవీకి సుమారుగా 65 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది

లోక చాప్టర్ 1 చంద్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్
మలయాళ చిత్ర పరిశ్రమలో హార్రర్, సస్పెన్స్ జోనర్స్‌కు ప్రేక్షకుల నుంచి ఫుల్ డిమాండ్ ఉంటుంది. దుల్కర్ సల్మాన్ నిర్మాత కావడం, దీనికి తోడు సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ మూవీ కావడంతో లోక చాప్టర్ 1 చంద్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి.
లోక చాప్టర్ 1 చంద్ర కలెక్షన్స్
లోక చాప్టర్ 1 చంద్ర మూవీ ఇండియా వైడ్‌గా తొలి రోజున 2.7 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టగా.. తొలి వారం 54.7 కోట్ల రూపాయలు, రెండో వారం 47 కోట్ల రూపాయలు, మూడో వారం 27.1 కోట్ల రూపాయలు, నాలుగో వారం 13.25 కోట్ల రూపాయలు, ఐదో వారం 9.8 కోట్ల రూపాయలు, ఆరో వారం 2.95 కోట్ల రూపాయలు రాబట్టింది. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసే నాటికి దుల్కర్ సల్మాన్ మవీ ఇండియాలో 154.8 కోట్ల రూపాయల నెట్, 181.3 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది.
ఇక ఓవర్సీస్‌లో లోక చాప్టర్ 1 విధ్వంసం సృష్టించింది. నార్త్ అమెరికా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలలో కలెక్షన్ల వర్షం కురిపించింది. లోక చాప్టర్ 1 ఓవర్సీస్ వసూళ్లలో నార్త్ అమెరికా, యూఏఈ ఏరియాల నుంచి మేజర్ షేర్ లభించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో కలిపి ఓవరాల్‌గా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా 119.30 కోట్ల రూపాయలు రాబట్టింది. తద్వారా ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయళ చిత్రాలలో లోక చాప్టర్ 1 రెండో స్థానంలో నిలిచింది. 142.25 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో మోహన్‌లాల్ నటించిన ఎల్ 2: ఎంపురాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి లోక చాప్టర్ 1 చంద్ర వరల్డ్ వైడ్‌గా 302 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లో లోక చాప్టర్ 1 కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా అంచనాలను మించి రాణించింది. తొలి రెండు రోజుల్లో అంతంత మాత్రం వసూళ్లు రాబట్టిన లోక చాప్టర్ 1 మూవీ ... తర్వాత ప్రభంజనం సృష్టించింది. దుల్కర్ సల్మాన్ మూవీ మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో 5.5 కోట్ల రూపాయలు, రెండో వారం 5.1 కోట్ల రూపాయలు, మూడో వారం 1.3 కోట్ల రూపాయలు, నాలుగో వారం 20 లక్షల రూపాయలు, ఐదో వారం 8 లక్షల రూపాయలు చొప్పున థియేట్రికల్ రన్ ముగిసేనాటికి 14.61 కోట్ల రూపాయల నికర వసూళ్లను ఆర్జించింది.
ఇండియాలోని ప్రాంతాల వారీగా లోక చాప్టర్ 1 వసూళ్లను పరిశీలిస్తే... కర్ణాటకలో 15.2 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 14.61 కోట్ల రూపాయలు, తమిళనాడులో 23.78 కోట్ల రూపాయలు, కేరళలో 119.14 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 8.57 కోట్ల రూపాయలు రాబట్టింది.
లోక చాప్టర్ 1కు లాభమెంత? నష్టమెంత?
బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి రాణించిన లోక చాప్టర్ 1 చంద్ర చిత్రం... నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను ఆర్జించింది. తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ రావాల్సి ఉండగా... దాదాపు 15 కోట్ల రూపాయల గ్రాస్, 8 కోట్ల రూపాయల షేర్ రాబట్టి... 5 కోట్ల లాభాల్ని అందించింది. ఓవరాల్‌గా 100 కోట్ల రూపాయల గ్రాస్, 50 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉండగా... 302 కోట్ల రూపాయల గ్రాస్, 150 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది లోక. తద్వారా డిస్ట్రిబ్యూషన్ షేర్ పరంగా 105 కోట్ల రూపాయలకు పైగా ప్రాఫిట్స్ అందించింది.
నిర్మాత దుల్కర్ సల్మాన్ ఈ సినిమా కోసం దాదాపు 65 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించగా.. ఓవరాల్ బడ్జెట్ మీద లోక చాప్టర్ 1 చంద్ర చిత్రం 302 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌తో దాదాపు 240 కోట్ల రూపాయలకు పైగా లాభాలను అందించింది. అయితే థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా నిర్మాత దుల్కర్ సల్మాన్‌కు మరిన్ని లాభాలు అందాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











